నాని హీరోగా నటించిన హిట్ 3 ది థర్డ్ కేస్ సినిమా విడుదలయ్యాక నాలుగు రోజులకు 101 కోట్ల గ్రాస్ సాధించిందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో దర్శకుడు శైలేష్ కొలను అడివి శేష్ ను సర్ ప్రైజ్ కామియో గా చూపించి కమర్షియల్ గా సినిమా వేల్యూ పెంచారు. ఈ సినిమాలో క్రైమ్ సీన్లు ఎక్కువగా వుండటంతో సెన్సార్ సర్టిఫికెట్ ఎ ఇచ్చారు. అయినా ప్రేక్షకులను ఈ సినిమా విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా టెక్నికల్ యాంగిల్ లో చూస్తే ఇందులో చాలా తప్పులు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు నాని ఫస్ట్ మర్డర్ చేసిన సమయంలో మాట్లాడుతూ తన డ్రైవర్ ను కీ అడిగే సమయంలో 180 డిగ్రీల నియమం పూర్తిగా మిస్ అయ్యింది. అక్కడ పెద్ద జంప్ కనిపిస్తుంది. అంత పెద్ద సినిమాలో ఇంత చిన్న టెక్నికల్ విషయం ఎలా మరిచిపోయారో అర్థం కాలేదు. 180 డిగ్రీ నియం అంటే ఉదాహరణకు రెండు కేరెక్టర్లు మాట్లాడుకునే సమయంలో దక్షిణం నుంచి షూట్ చేస్తున్నప్పుడు షూట్ మొత్తం దక్షిణం నుంచే చెయ్యాలి. లేదు ఉత్తరం నుంచి కూడా చేయాల్సి వచ్చినప్పుడు కెమెరాను ఫాలో చేస్తూ ఉత్తరం వైపుకు తీసుకెళ్లి అప్పుడు ఉత్తరం నుంచి చెయ్యాలి. దీని వల్ల ఆడియన్ రెండు పాత్రలు ఎక్కడున్నాయి అనేది కన్ ఫ్యూజ్ అవ్వడు. ఇక్కడ నాని, తన సబ్ ఆర్డినేట్స్ తో మాట్లాడే సమయంలో సడన్ గా యాక్సెస్ మార్చి చిత్రీకరణ జరిపారు. దీంతో చిన్న పాటి జర్క్ వుంటుంది. కొత్త దర్శకులకు ఇది కాస్త భయపెట్టే అంశం కావడం విశేషం. ఇక అడివిశేష్ , నానితో స్రీన్ షేర్ చేసుకోవడం పట్ల ఆడియన్స్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. హిట్3 సినిమా విడుదలకు ముందే కమర్షియల్ హిట్ సాధిస్తుందని సినిమా రిపోర్టర్ విడుదలకు ముందే చెప్పింది. అలాగే రెట్రో బజ్ లేదు కాబట్టి నష్టం చవి చూస్తుంది అని కూడా ముందుగానే సినిమా రిపోర్టర్ బిజినెస్ న్యూస్ లో చెప్పడం విశేషం.
Social Plugin