G-N7RFQXDVV7 ప్రపంచ వ్యాప్తంగా చిన్న సినిమా బిజినెస్ చెయ్యచ్చు కానీ

Ticker

6/recent/ticker-posts

ప్రపంచ వ్యాప్తంగా చిన్న సినిమా బిజినెస్ చెయ్యచ్చు కానీ

 


మనం షార్ట్ ఫిల్మ్ లు చేసి యూటూబ్ లో పెట్టుకోవడమేనా? లేక మన షార్ట్ ఫిల్మ్ లకు ప్రపంచ వ్యాప్తంగా  ఏదైనా మార్కెట్ వుందా? అని చాలా మందిలో వున్న ఆలోచనలు , నాలో కూడా వున్నాయి. ఇక్కడ పనిలో ఆనందాన్ని వెతుక్కోవడంమే విజయానికి మూల సూత్రం. మనం చేస్తున్న ఏ పనైనా త్రికరణ శుద్ధితో చేయాలి.. అప్పుడే  మనకు ఊహించనంతగా మానసిక బలం పెరుగుతుంది. ఆ పనినే మనం మరింత మెరుగ్గా కొత్తగా చేయడానికి ఏం చేయాలో ఆలోచించాలి. నేర్చుకోవాలి. నేర్చుకున్న దాన్ని ప్రాక్టీసులో పెట్టాలి.  అంతే తప్ప నాకు తెలివి తేటలున్నాయి అని ఆలోచిస్తూ కూర్చుంటే ఏ పని ముందుకు సాగదు. ముందుకు సాగాలంటే దానికి అప్లికేషన్ తప్పని సరి. ఈ  ఉపోద్గాతం చెప్పడానికి చిన్న కారణం వుంది.   ప్రస్తుతం ఎన్నో షార్ట్ ఫిలిమ్ లు రూపొందుతున్నాయి. అలాగే ఎన్నో సినిమాలు రూపొందుతున్నాయి.  ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే ఇండియాలోనే ఎక్కువ షార్ట్ ఫిల్మ్ లు,  సినిమాలు రూపొందుతున్నట్టు ఒక సర్వేలో తేలింది. ఇవి రూపొందడానికి ముఖ్య కారణం డబ్బు త్వరగా సంపాదించాలనే కోరిక కావచ్చు… లేదా తన గురించి అందరూ మాట్లాడుకోవాలనే బలమైన వాంఛ కావచ్చు…  మనం రూపొందించిన  షార్ట్ ఫిలిమ్స్ నుంచి గానీ సినిమాల నుండి డబ్బు ఎలా వస్తుంది అనేది విశ్లేషించుకోవడంలో విఫలమైన చాలా మంది నిర్మాతలు సినిమాలు విడుదలైన తర్వాత కనిపించకుండా పోతున్నారు. ఏ రంగంలో నైనా ప్రాడక్టు తయారు చేయడం సులభమే. కానీ దాన్ని మార్కెట్ చేయడమే కష్టం.  కానీ మన సినిమా రంగంలో మాత్రం. ప్రాడక్టు తయారు చేయడం కష్టమే దాన్ని మార్కెట్ చేయడం కూడా కష్టమే. ఈ మార్కెటింగ్ విషయానికి వచ్చేసరికి చాలా మంది చతికిల పడిపోతున్నారు. ఈ మార్కెట్ ను విశ్లేషించిన ఓ మిత్రుడు చెప్పిన ఆసక్తికరమైన విషయాలే ఈ వీడియో తయారు చేయడానికి ప్రేరణ కలిగించాయి.  జాకబ్ అనే మలయాళీ స్నేహితుడు ఒకరు మలయాళంలో నాలుగు సినిమాలు రూపొందించారు. ఆ సినిమాల పేర్లు పబ్లిక్ కు కాదు కదా… అతని ప్రాణ స్నేహితులకు కూడా తెలీదు. కానీ అతను మంచి సినిమాలు తీస్తాడు. అతను మంచి సెన్సిబుల్ డైరెక్టర్ అనే విషయం మాత్రం అందరికీ తెలుసు. బయటికి పేర్లు కూడా తెలియని సినిమాలను రూపొందించి ఎక్కడా తన అబిరుచిని వదులుకోకుండా తను నమ్మిన సిద్ధాంతాన్ని ఆ సినిమాల్లోకి చొప్పిస్తూ… ఒక్కో సినిమాకు దాదాపు నాలుగు కోట్లకు పైగా సంపాదించాడు.  సినిమా తీయడంతో ఏ నిర్మాతలైనా, దర్శకులైనా ఏం ఆలోచిస్తారు? మంచి సినిమా తీయాలి. డబ్బు బాగా సంపాదించాలి. తనకు మంచి పేరు రావాలి అనే ఆలోచిస్తారు.. అయనా అదే చేశారు. మంచి సినిమా లను, నిజంగా సమాజానికి ఉపయోగపడే సినిమాలను నిర్మించారు.  డబ్బు సంపాదించే సినిమాలను నిర్మించి తను అనుకున్నది సాధించారు. సినిమా ప్రారంభానికి ముందే శాటిలైట్ అమ్మితే ఇంతొోస్తుంది. విడుదలైతే అంతొస్తుంది అమెజాన్ ప్రైమ్ కు అమ్మితే ఇంతొస్తుంది. నెట్ ఫ్లిక్స్  రైట్స్ తీసుకుంటే కొంచెం పెరిగే అవకాశముంది ,డిజిటల్ రైట్స్ మొత్తం ఇస్తే పోలా….అంటూ లెక్కలు కట్టి సినిమాలు నిర్మిస్తే అందులో క్వాలిటీ లేకపోతే ఏ రైట్స్ నిర్మాతలకు మిగలవు. కాబట్టి ప్రపంచం కోరే సినిమాలను నిర్మించాలి. మన బిజినెస్ ను ప్రపంచ వ్యాప్తంగా పెంచుకోవాలి. ఇక్కడ కాకపోతే ఇంకెక్కడో దానికి సంబంధించిన ఫలితాలు అందుతాయి. కొత్త నిర్మాత పంపిణీ రంగం ఎలా వుంటుందో తెలీకుండానే సినిమాలు నిర్మిస్తున్నారు. తీరా సినిమా పూర్తయ్యాక పంపిణీ ఎలా చేయాలో రీసర్చ్ చేస్తున్నారు. ఎన్. ఆర్.ఎ అంటే ఏంటో, ఔట్ రేట్ అంటే ఏంటో ఎమ్. జి… మినిమమ్ గ్యారెంటీ లేంటో అని, సినిమా నిర్మాణం పూర్తయ్యాక  నేర్చుకుంటూ ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు ప్రపంచ వ్యాప్తంగా అయ్యే బిజినెస్ కు పడితే ఎవరిపై ఆధారపడకుండా తెలుగు సినిమా బిజినెస్ రేంజ్ ను పెంచుకోవచ్చు కద.. అంటున్నారాయన…. ఆయన చెప్పింది అక్షరాల నిజం. మంచి సినిమాకు ఎక్కడైనా మార్కెట్ వుంటుంది.  అదెలాగ అంటే మనం నిర్మించిన సినిమాలను కానీ, షార్ట్ ఫిలిమ్స్ ను గానీ ఫిలిమ్ మార్కెట్ ద్వారా అమ్మచ్చు. ఈ సినిమాలను ఎవరు కొంటారు. ఎందుకు కొంటారు అని మీరు ఆలోచించవచ్చు.  కాబట్టి మనం తీయబోయే సినిమా యూనివర్సల్ సబ్జెక్ట్ అయి వుండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక వేళ అలాంటి సబ్జెక్ట్ తో తీసినా కొనేవాళ్లు ఎవరు? అనే సందేహం మీకు కలగచ్చు. ప్రపంచంలో ఐక్యరాజ్య సమితిలో సభ్యులుగా  దాదాపు 193  దేశాలుంటే అన్నింటిలోనూ సినిమా నిర్మాణం జరగదు. కానీ ఆయాదేశాల్లో  టి.వి. ఛానెల్స్, ఇతర ఎంటర్ టైన్ మెంట్ మాధ్యమాలు వుంటాయి. ఇలాంటి ఫిలిమ్ ఫెస్టివల్, ఫిలిమ్ మార్కెట్ లను ఆయా దేశాల డిస్ట్రిబ్యూటర్లు సందర్శించి తమ దేశాల్లో సినిమాల ప్రదర్శన నిమిత్తం వాళ్లకు నచ్చిన షార్ట్ ఫిలిమ్స్ ను, సినిమాలను ఫిల్మ్ మార్గెట్ లో కొంటుంటారు. ఏఏ దేశాల్లో ఎలాంటి జానర్ సినిమాలకు ప్రాధాన్యత వుంటుందని విషయాన్ని, ఫిల్మ్ మార్కెట్ అంటే ఏంటి? అది ఎక్కడ జరుగుతుంది అనే విషయాలను మరో ఎపిసోడ్ లో అందిస్తాం.