G-N7RFQXDVV7 సర్దార్ 2 తెలుగులో 20 కోట్ల దాకా కలెక్ట్ చేస్తుంది ఎవరైనా ట్రై చేసుకోవచ్చు

Ticker

6/recent/ticker-posts

సర్దార్ 2 తెలుగులో 20 కోట్ల దాకా కలెక్ట్ చేస్తుంది ఎవరైనా ట్రై చేసుకోవచ్చు

 

సర్దార్ 2 సినిమాపై  ప్రస్తుతం డిస్ట్రిబ్యూటర్లలో పెద్ద చర్చ నడుస్తోంది. దీనికి ప్రత్యేకమైన కారణం వుంది. సర్దార్ 1 నాలుగున్నర కోట్లకు కొంటే దాదాపు 12 నుంచి 15 కోట్ల దాకా వసూలు చేసింది. దాంతో సర్దార్ 2 పై డిస్ట్రిబ్యూటర్లలో భారీ అంచనాలు నెలకొన్నాయి.  దాన్ని బేస్ చేసుకొని సర్దార్ 2 ఎంత వరకు బిజినెస్ జరగచ్చు.  ఆ సినిమా కొంటే లాభాలు ఎలా వుండచ్చు అనే అంచనాల కోసం పలువురు డిస్ట్రిబ్యూటర్ల దగ్గర సమాచారం సేకరించి మీకందించడానికి ప్రైమ్ పేజస్ సిద్ధమైంది. ఇక వివరాల్లోకి వెళితే…

కార్తి హీరోగా నటించిన సర్దార్ సినిమా తెలుగులో మంచి వసూళ్లు సాధించింది. నాలుగు వారాల కింద సర్దార్ 2 కు సంబంధించిన ప్రోలోగ్ టీజర్ ను విడుదల చేశారు. పి.ఎస్. మిత్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే ఈ సీక్వెల్ లో ప్రొలోగ్ టీజర్ ను బట్టి చూస్తే బ్లాక్ డ్రాగన్ గా ఎస్.జే సూర్య బ్లాక్ డాగర్ గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ టీజర్ లో అధికారులు ప్రతినిధి కోసం వెతుకులాటలో ఒక మఠంలోకి చొచ్చుకొని వెళ్లడానికి ప్రయత్నించడం. అక్కడ కార్తి గూఢాచారి పాత్రలో చెంగ్ ను ఎదుర్కోవడం. సన్నివేశాలను చాలా క్వాలిటీతో చిత్రీకరించారు. ఆ సందర్భంలో చెంగ్ చావు బతుకుల మధ్య గర్వగా మీ దేశాన్ని ఒక విధ్వంశకర శక్తి సమీపిస్తోంది. చేతనైతే నీ ప్రాణాలు, నీ దేశాన్ని కాపాడుకో అని చెంగ్ చెబుతాడు. విలన్, బ్లాక్ డాగర్ గా ఎస్.జే సూర్యను చూపించారు. ఈ ప్రొలాగ్ టీచర్ ఒక ఆసక్తికరమైన స్పై థ్రిల్లర్ ను చూపిస్తోందని టీజర్ ద్వారా దర్శకుడు హామీ ఇచ్చినట్టయ్యింది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ లో కార్తి తండ్రి కొడుకులు గా ద్విపాత్రాభినయం చేశారు. దేశద్రోహి కొడుకు అనే పేరు పోగొట్టుకోవడానికి కొడుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఆ పోలీసు అధికారి అయిన కొడుకు తండ్రి రహస్యాలను మరియు దాని వెనుక వున్న కుట్రను ఎలా తెలుసుకుంటాడు అనేది ఈ కథ సూచిస్తోంది.

ఇక ఈ సినిమా బిజినెస్ ఎలా జరుగుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం హక్కులను తెలుగుకు ఎంత చెబుతున్నారు అనే విషయాన్ని మనం చర్చించుకుందాం. గతంలో కార్తి హీరోగా నటించిన సర్దార్ సినిమా ఇంచుమించు ఏడు కోట్ల యాభై లక్షల దాకా షేర్ కలెక్ట్ చేసింది. ఇక ఆ సినిమా మూడు రోజులకు ఓపెనింగ్ చూస్తే దాదాపు 2.5 కోట్ల గ్రాస్ ను వసూలు చేసినట్టు సమాచారం. మేము చెబుతున్న ఫిగర్స్ కొంచెం అటు ఇటుగా వుండచ్చు. కానీ దగ్గర్లో వుంటాయి. ఇది డిస్ట్రిబ్యూటర్ల, మరి ఎగ్జిబిటర్ల ఐడియా కోసం ఇస్తున్న సమాచారం. సర్దార్ 1 ను కంపేర్ చేస్తే సర్దార్ 2 సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ వుంది. ఆ సినిమా రిలీజు సమయంలో తెలుగు సినిమాలలో సరైన అపోజిషన్ లేకపోతే సర్దార్ 1 సినిమా కలెక్ట్ చేసిన గ్రాస్ కంటే డబుల్ వచ్చే ఛాన్స్ కూడా వుంటుంది. మొదటి పార్ట్ ను, రెండో పార్ట్ ను కంపేర్ చేస్తే సర్దార్ 2 లో ఆర్టిస్టు వేల్యూ పెరిగింది. అలాగే బడ్జెట్ పరంగా కూడా చాలా కేర్ తీసుకున్నట్టు  టీజర్ చూస్తుంటే కనిపిస్తోంది. సర్దార్ 2లో  ఎస్.జే సూర్య తీసుకోవటం వలన సినిమాకు చాలా బలం చేకూరింది అని అంటున్నారు. సర్దార్ 2 గురించి పలువురు డిస్ట్రిబ్యూటర్లతో డిస్కషన్ చేసినప్పుడు  ఈ సీక్వెల్ కు యావరేజ్ టాక్ వస్తే ఎంత  లీస్ట్ అనుకున్నా 12 కోట్ల నుంచి 15 కోట్ల దాకా కలెక్ట్ చేసే అవకాశం వుంది.  అదే సర్దార్ 1 లాగా పాజిటివ్ టాక్ వస్తే 20 కోట్ల వరకు వసూలు చేసే అవకాశం వుంది. హీరో కార్తికి తెలుగులో ఆ కేపబిలిటీ వుంది.  కార్తీ హీరోగా నటించిన ఖైధీ సినిమా గురించి మాట్లాడుకుంటే ఆ సినిమాను రాదా మోహన్ నాలుగున్నర కోట్లకు తెలుగు హక్కులను కొన్నారు. ఆ సినిమా ఆ కాలంలోనే  12 నుంచి 15 కోట్ల దాకా వసూలు చేసింది. ఇక మధ్యలో కార్తీ హీరోగా వచ్చిన  సత్యం సుందరం సినిమా గురించి మాట్లాడుకుంటే అది కమర్షియల్ సినిమా కాదు.  ఫీల్ గుడ్ మూవీ కావడం. అందులోనూ దేవర సినిమాకు అపోజిషన్ గా విడుదల చేయడంతో.  సినిమా బాగున్నా కలెక్షన్లు సన్నగిల్లాయి. అలాంటి గడ్డు పరిస్థితుల్లో కూడా సత్యం సుందరం రెండు కోట్ల దాకా షేర్ వసూలు చేసింది.  ఇక సర్దార్ 2 విషయానికి వస్తే ప్రస్తుతం సర్దార్ 2 కు వున్న క్రేజ్ బట్టి చూస్తే  ఒక పెద్ద కమర్షియల్ సినిమాకు ఎలా ఓపెనింగ్స్ వుంటాయో ఈ సినిమాకు కూడా అలాంటి ఓపెనింగ్స్ వుండే ఛాన్స్ వుంది. ఈ  సినిమా .జూన్ లో విడుదలయ్యే ఛాన్స్ వుంది. ఇక అపోజిషన్స్ ఏమైనా వున్నాయా అని చూసుకుంటే జూన్ 5న మణిరత్నం, కమల్ హాసన్ , శింబు కాంబినేషన్ లో థగ్ లైఫ్ విడుదల అవుతుంది. తెలుగు సినిమాల విషయానికి వస్తే జూన్ 20న శేఖర్ కమ్ముల, ధనుష్ కాంబినేషన్ లో వస్తున్న కుబేరా విడుదల కానున్నట్టు తెలుస్తోంది. సర్దార్ 2 సినిమా విడుదల టైమ్ లో పెద్ద సినిమాలు విడుదల లేకపోతే మంచి కలెక్షన్లు సాధించే అవకాశం వున్నట్టు తెలుస్తోంది.అంటూ పలువురు డిస్ట్రిబ్యూటర్లు తమ తమ అభిప్రాయాలను  తెలిపారు. ఎస్. లక్ష్మణ్ కుమార్ తన ప్రిన్స్ పిక్చర్స్ ద్వారా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.