ఎస్. ఎస్. రాజమౌళి మహాభారతాన్ని తెరకెక్కించడం నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని రాజమౌళి చాలా సార్లు చెప్పారు. మహాభారతాన్ని ఇప్పుడే తెరకెక్కిద్దాం అనుకుంటే ఇప్పుడున్న అనుభవం నాకు సరిపోదు అంటూ బాహుబలి కంటే ముందే చెప్పారు. కానీ బాహుబలి చిత్రం ప్లాట్ కూడా మహాభారతాన్ని పోలి వుంటుంది. ఈ మహాభారతాన్ని నాలుగైదు భాగాలు గా చిత్రీకరించాలని తన మనసులో వున్నట్టు రాజమౌళి చాలా సార్లు బయటపెట్టారు. ఇటీవల హిట్ 3 ప్రమోషన్స్ టైమ్ లో కొన్ని ఆసక్తికర విషయాలను రాజమౌళి బయట పెట్టారు. అసలు విషయం ఏంటంటే మహాభారతం కోసం జక్కన్న లోలోపల ఆర్టిస్టులను కూడా సెలెక్ట్ చేస్తున్న విషయం తెలుస్తోంది. ఎందుకంటే గతంలో రాజమౌళి మహాభారతం మొదలు పెడితే కొంతమంది స్టార్ హీరోలను తాను వదులుకోవడానికి ఇష్టం లేదని చెప్పారు. ఇప్పటికే మూడు కేరెక్టర్లకు రాజమౌళి ఆర్టిస్టులను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. రీసెంట్ గా హిట్ 3 వేడుకలో మహాభారతంలో నాని ఫిక్స్ అని చెప్పడంతో ముందు అనుకున్న కేరెక్టర్ల వివరాలు కూడా ముందుకు వచ్చాయి. మహా భారతంలో శ్రీకృష్ణుడి పాత్ర కోసం తాను జూనియర్ ఎన్టీఆర్‌ను ఎంచుకుంటానని. ఎన్టీఆర్ వంటి వక్త, నటనా ప్రతిభ ఉన్న వ్యక్తి శ్రీకృష్ణుడి గంభీరత్వాన్ని, చమత్కారాన్ని సమర్థంగా చూపించగలడు అని రాజమౌళి అభిప్రాయం. ఎన్టీఆర్ ను శ్రీకృష్ణుడి చూపించడం తన కల అని గతంలో చెప్పారు. అయితే మరో ఇంటర్వూలో మహాభారతంలో కర్ణుడి పాత్ర గురించి మాట్లాడాారు. కర్ణుడి పాత్రకు అద్బుతమైన ఎమోషన్, గంభీరత అవసరం. అలాంటి పాత్రలకు ప్రభాస్ అయితే సరిగ్గా సరిపోతారు. అతని విభిన్న శైలితో కర్ణుడి పాత్రలో ఒదిగిపోతాడు అని చెప్పారు. ఇప్పుడు హిట్ 3 ఫంక్షన్ లో నాని ఫిక్స్ అని చెప్పడంతో మహాభారతం కోసం జక్కన్న ముగ్గురిని ఫిక్స్ చేశారని స్పష్టం అవుతోంది. అయితే ఈ ముగ్గురు హీరోలు గతంలో రాజమౌళి సినిమాల్లో పని చేసిన వాళ్లే కావడం విశేషం. మరి మహేష్ బాబు, రామ్ చరణ్ లకు రాజమౌళి ఏ పాత్రలను క్రియేట్ చేస్తారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే రాజమౌళి మొదటి నుంచి తెలుగు హీరోలకే ప్రాముఖ్యతనిస్తూ ముందుకు వెళుతున్నారు. చాలా మంది బాలీవుడ్ హీరోలు, తమిళ, మలయాళ హీరోలు రాజమౌళి దర్శకత్వంలో హీరోగా నటించాలని కలలు కని రెకమెండేషన్ లు కూడా తీసుకెళ్లారనీ, అయినా రాజమౌళి తెలుగు వాళ్లకే ప్రాముఖ్యతనిస్తారని రాజమౌళి సన్నిహితులు చెప్పారు. ఇదిలా వుంటే తాజాగా అమీర్ ఖాన్ తన ప్రొడక్షన్ లో మహాభారతం ఆధారంగా ఒక సినిమా నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టు పలు భాగాలతో తెరకెక్కుతోందని దీనిపై పలువురు దర్శకులు పనిచేస్తున్నారని అమీర్ ఖాన్ తెలిపారు. మరి జక్కన్న స్టెప్ ఎలా వుండబోతోంది అనే ప్రశ్న టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది.
Social Plugin