G-N7RFQXDVV7 ఊర్వశి శారద అనుభవాలు రెండో భాగం

Ticker

6/recent/ticker-posts

ఊర్వశి శారద అనుభవాలు రెండో భాగం

 


ఊర్వశి శారద గారి జీవితంలో జరిగిన అనుభవాలను మొదటి ఎపిసోడ్ లో మనం చాలా చర్చించుకున్నాం. మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు శారద గారి జీవితంలో జరిగిన మరి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.

 మలయాళం లో 'తులాభారం' వచ్చాక ఆ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో నిర్మించడానికి హక్కులు కొన్న జెమినీ బాలసుబ్రమణ్యంగారు ఏదో మాటల సందర్భంలో దర్శకులు కె. బాలచందర్ గారితో మాట్లాడుతూ, " తులాభారంలో హీరోయిన్ గా నటించిన అమ్మాయి చాలా బాగా నటించింది. ఆమెకే తెలుగు నేర్పించి, తెలుగులో కూడా నటింపజేదాం అనుకుంటున్నాం” అన్నారట. అప్పుడు బాలచందర్ గారు, "ఆమె తెలుగు నటే..చలం భార్య" అన్నప్పుడు ఆయన నివ్వెరపోయారట. " మలయాళంలో అంత బాగా మాట్లాడుతూ నటిస్తూండడం చూసి మలయాళ నటే అనుకున్నాను" అని విస్తుపోతూ చెప్పారట బాలసుబ్రమణ్యంగారు.

ఉదాహరణకు 'ఉద్యోగస్థ' అనే మలయాళ చిత్రం ఇది ఆ మధ్య 'మా మంచి అక్కయ్య' పేరిట తెలుగులో వచ్చింది. ఆ చిత్రం లో శారద  పాత్ర ఒక కుటుంబంలోని పెద్ద కూతురు. తన తమ్ముడు, చెల్లెలు చదువులకు, సంపాదన లేక వ్యాధిగ్రస్తు డుగా వున్న తండ్రిని కాపాడడానికి ఆమె ఎన్నో కష్టాలు పడుతూ, జీవితంలో ఏ సుఖాన్నీ చవిచూడకుండానే చనిపోతుంది. ఈ పాత్ర నేటి సమాజంలో అలాంటి స్త్రీల అవస్థలను చక్కగా ప్రతిబింబింప జేస్తుంది. కుటుంబంలో పిల్లలు ఎక్కువగా పుండడం వాళ్ళకు కనీస సౌకర్యాలను అమర్చలేని పెద్దవాళ్ళ కష్టాలు.... కన్నీళ్ళు మనం చూస్తూనే వున్నాము. శారద ఔట్ డోర్ షూటింగ్ కని వెళ్ళిన ప్రదేశాల్లో కూడా ఇలాంటి పరిస్థితులను చూసే సందర్భం కలిగిందట. ఆ తర్వాత అభిమానులందరికీ శారద మలయాళ పత్రికల ద్వారా ఒక ప్రకటన చేశారు. "ఉద్యోగస్థ'' లోని పెద్ద కూతురులాంటి స్త్రీలు కుటుంబంలోని బరువు, బాధ్యతలు నెత్తిన మోస్తూ తమ సుఖాలను త్యాగం చేసి, జీవచ్చవా లలా బ్రతుకుతూ వుండడానికి కారణం ——కుటుం బంలోని పెద్దలు పరిమితి లేకుండా సంతానాన్ని పొందుతూ పుండడమే. తక్కువ సంతానం కలిగినప్పుడు వాళ్ళను ఆరోగ్యంగా వుంచడానికీ, అన్ని సౌకర్యాలను అమర్చి, భావి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఎంతో వీలుంటుంది" అన్న శారద విన్నపాన్ని అభిమానులు మెచ్చు కుంటూ ఆమెకు కెన్నో పుత్తరాలు వ్రాశారు — "మీ అభ్యర్ధనలో ఎంతో అవగాహన, నిజాయితీ వున్నవంటూ" శారద ఉద్దేశ్యాన్ని అభిమానులు అర్ధం చేసుకుని, ఆదరించినందుకు ఆమె చాలా సంతోష పడ్డారట.

అభిమానుల ప్రవర్తన ఒక్కోసారి వినోదదంగా కూడా వుంటుంది. ఆ మధ్య పాండిచ్చేరి వద్ద శారద నటిస్తున్న ఒక చిత్రం అవుట్ డోర్ షూటింగ్ జరుగుతూ వుంది. శ్రీ విన్సెంట్ డైరక్టు చేస్తున్నారు. శారద ఒక కాలేజీ విద్యార్ధి నిలా రెండు జడలు వేసుకుని పిల్లలతో ఆడుతూ వుండే దృశ్యాన్ని చిత్రీకరిస్తున్నారట. దగ్గరలో చుట్టూ జనం గుమిగూడి షూటింగ్ చూస్తున్నారట. వాళ్ళలో సుమారు ఓ యాభై సంవత్సరాల వ్యక్తి చుట్ట కాలుస్తూ, చూస్తూ వుండగా, అతని ప్రక్కనే వున్న ఓ యువకుడు అతనితో చేస్తున్న సంభా షణ శారద చెవిన పడిందట. "మామయ్యా. మొన్న చూసిన 'తులాభారం' సినిమాలో హీరోయిన్ ఆమెనే" అన్నాడట యువకుడు ఉత్సాహంగా. ఇది విన్న తలపాగా అతను..."పోరా: నాతోనే ఎకసెక్కాలు ఆడుతున్నావా? ఆవిడేమో ముగ్గురు పిల్లల తల్లి: ఈ అమ్మాయి. చూస్తే చిన్న పిల్ల .... నాకేమీ తెలియదని, ఏమారుస్తున్నావా?" అని గట్టిగా అరిచాడు. శారద అది విని, షూటింగ్ జరుగుతోందన్న సంగతి కూడా మరచిపోయి గట్టిగా నవ్వేసిందట.. 'యక్షి' అనే మలయాళ చిత్రకథ చాలా విచిత్రంగా వుంటుంది. ఆ చిత్రంలో శారదను ఒక 'యక్షిణి'  అంటే మోహినీ పిశాచిలా చూపించారు. చిత్రంలో శారద మామూలు స్త్రీనే అయినా కథ కోసం ఆ విధంగా కనిపించేలా చిత్రీకరించారు. 'య' చిత్రం విడుదలయ్యాక పిల్లలు శారదను చూసి భయపడుతూ వుండేవారు. పిల్లలు భయ పడడానికేం—ఆ చిత్రం చూసినప్పుడు శారద వచ్చిన సీన్లు చూసి శారద గారే భయపడ్డారంటే అతిశయోక్తి కాదు.:

అభిమానుల ఆదరణవల్ల లభించిన 'ఊర్వశి' బిరుదు స్వీకరించిన సందర్భంలో ఒక విశేషం

జరిగింది.ఢిల్లీలో అప్పుడు చలి అధికంగా వుంది. బిరుదు ప్రదానోత్సవానికి ముందు కొన్ని ఫంక్షను లలో పాల్గొనడానికి నాలుగు రోజులు ముందు గానే వెళ్ళి 'అశోకా హోటల్ ' లో శారద గారు బస చేశారట.

ఆ రోజు ఆశోకా హోటల్లోనే ఒక విందు ఏర్పాటు చేశారట. విందులో పాల్గొనడానికి ముందుగా ఇంకో సమావేశానికి వెళ్ళడంవల్ల అక్కడకు చేరుకునేటప్పటికి ఆమెకు కొంత ఆలస్యం జరిగిందట. విందుకు ఆహ్వానింపబడినవారు పత్రికా విలేఖరులు, "ఊర్వశి" శారద ఊర్వశిలాగే చక్కగా అలంకరించుకుని వస్తుందని ఎదురు చూస్తున్నారు కాబోలు: శారద మామూలుగా తెల్ల చీరె కట్టుకుని చలి ఎక్కువగా వుండడంవలన శాలువ కప్పుకుని మొఖం మీద పౌడర్ కూడా పూసుకోకుండా అక్కడకు వెళ్ళేటప్పటికి —— వాళ్ళు చూపిన సంభ్రమాశ్చర్యాలు  శారదకు వింత అను భూతి కలుగజేసిందట. పత్రికా విలేఖరులు చిత్రం గురించి, ఆమె నటన గురించి ప్రశ్నించకుండా "అరె: మీరింత సింపుల్ గా వున్నారే..... ఎలా వీలవుతుంది" అని అడిగారట. "సింపుల్గా వుండడమే నా కిష్టం" అంటూ ఆమె సమాధానం ఇచ్చారట.

బహుమతి ప్రదానోత్సవంలో శారదను వేదిక పైకి ఆహ్వానించి "మొట్టమొదటి 'ఊర్వశి' బిరుదు శ్రీమతి శారదకు సమర్పింపబడుతున్నది" అని ప్రకటించినప్పుడు ఆ కరతాళధ్వనులు, ఆదృశ్యం ఎప్పటికీ మరిచిపోలేను అని శారద గారు చెప్పారు.. ఈ బిరుదుకు అర్హురాలిని చేసింది నా అభిమానులే కద అని కళ్లకు నీళ్లు వచ్చాయి. అయితే, అభిమానులన్న తర్వాత అందరూ ఒకేలా ప్రవర్తించరు. అదే ఒక్కోసారి బాధ  కలిగిస్తుంది అని శారద ఒక ఇంటర్వూలో చెప్పారు. కొందరు మమ్మల్ని ఒక వినోద వస్తువులా భావిస్తూ ఎబ్బెట్టుగా ప్రవర్తించి, మనసును గాయపరుస్తారు. నిజానికి మేమూ మామూలు మనుషులమే కదా ! " సినిమాల్లో నటిస్తున్నంత మాత్రాన కొందరు ఎందుకలా తక్కువ అంచనా వేస్తూ బాధ కలిస్తారు ? " అనేది నాకు అర్థంకాని విషయం. ఏ అవుట్ డోర్ షూటింగుకన్నా మేం వెళ్ళామను కోండి. నీడకోసం ఎక్కడో ఒకచోట నిలబడతాం.. చుట్టూ కొందరు గుంపుగా గుమిగూడ తారు. అందులో ఎవరో ఒకరు ఎగతాళిగా తిర స్కార భావంతో ఒక మాట అనడం, తక్కిన వారు సంస్కారం మరిచిపోయి ఫకాలుమని నవ్వడం వింటూ వుంటాం. అలాంటి సందర్భా లలో మా మనసు లెంత బాధపడతాయో అని వాళ్ళు కాస్త కూడా ఆలోచించరు అంటూ ఆ ఇంటర్వూలో ఆమె బాధ పడ్డారు.

సినిమాలలో రకరకాల పాత్రలు ధరించవలసి వుంటుంది. నిజ జీవితంలో కూడా మేం అలాగే వుంటామని వాళ్ళు పొరబాటుగా వూహించడం వల్లనే ఇలా జరుగుతుందనుకుంటాను. జీవితం కూడా అందరిలాగే, కష్టసుఖాలతోనూ, నిత్యం వుండే సమస్యలతోనూ ముడిపడివున్న జీవితమే. అదేం సినిమా కధ కాదు. సినిమాలో అనుకున్నప్పుడల్లా వేషాలు మార్చుకున్నట్లు నిజ జీవితంలో మార్చగలమా ? 'సినిమా పరిశ్రమ' కూడా మిగతా పరిశ్రమల లాటిదే.. అందులో వున్నంత మాత్రాన_కొందరు అభిమానులు మమ్మల్నెందుకలా కించపరుస్తూ అసభ్యంగా ప్రవ ర్తిస్తారో అర్థంకాదు .ఇతరులను తక్కువగా అంచనా వేసి, కించ పరచడం, వారి పట్ల అమర్యాద చూపడం, తమ స్థితిని మరిచిపోయి, ఎబ్బెట్టుగా ప్రవర్తించడం లాంటివి జీవితంలో ప్రగతికి ఏమాత్రం సహాయం చేయలేవు అని చెప్పడం తప్ప మేమేంచేయగలం ?

అభిమానులు సహృదయంతో మా నటనను, అందులోని లోటుపాట్లను గురించి చెబుతు న్నప్పుడు—— మమ్మల్ని అభినందిస్తున్నప్పుడూ, మేము పడ్డ శ్రమ అంతా మరిచి, ఆ అభిమానాన్నే నూతన శ క్తిగా స్వీకరించి, ఇంకా సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి కృషి చేస్తాము. అందరూ అలాగే ప్రోత్సాహ మిచ్చినప్పుడు  అంతకంటే ఇంకేం కావాలి? అంటూ  ఆ ఇంటర్వూలో చెప్పారు.