G-N7RFQXDVV7 జేమ్స్ కమెరూన్ టెక్నాలజీ ద్రోహి?

Ticker

6/recent/ticker-posts

జేమ్స్ కమెరూన్ టెక్నాలజీ ద్రోహి?






మనిషికి డబ్బు, ఆరోగ్యం, నిద్రల విలువ తెలియాలంటే వాటికి అప్పడప్పుడు అంతరాయం కలుగుతూ వుండాలి. ఒక మనిషికి తనలోని మానసిక శక్తుల సామర్థ్యం తెలియాలంటే అవాంతరాలు ఎదురవ్వాలి. అని వివేకానందుడు చెప్పిన మాటలు గుర్తు వస్తున్నాయి. 

ప్రస్తుతం ప్రపంచంలో ఏ రంగాన్ని తీసుకున్నా,  ఏ.ఐ పేరు వినగానే హడలిపోతున్నాయి. ఏ.ఐ అంటే సాప్త్ వేర్ ఉద్యోగులు భయపడతారు? మాకేం భయం.. మాదంతా క్రియేటివ్ ఫీల్డమ్మా.. మా పుట్టలో ఎవ్వరూ వేలు పెట్టలేరు  అంటూ ఆ మధ్య సోషల్ మీడియా డిస్కషన్ రూమ్ లో పెద్ద చర్చే జరిగింది. అది జరిగిన కొద్ది రోజులకే ఇండియన్ సినిమాలో డైరెక్టర్ల చక్రవర్తి అయిన రాంగోపాల్ వర్మసారీ సినిమాలో ఓ పాటను ఏ.ఐ తో క్రియేట్ చేశా . అని చెబుతూ అది ఎలా చేయాలో కూడా  ఓ ఇంటర్వూలో చేసి చూపించి అందరి నోర్లు మూయించారు. అంతే కాదు ఇప్పుడు రవితేజ హీరోగా నటించిన మాస్ జాతర సినిమా కోసం స్వర్గీయ చక్రి గారి స్వరంతో ఒక పాటను ఏ.ఐ తో క్రియేట్ చేసి విడుదల చేశారు. ఇప్పుడు ఇది టాలీవుడ్ లో సంచలనంగా మారింది.

ఇదే అంశం ఇప్పుడు హాలీవుడ్ లో భయాందోళనలు కలుగ జేస్తోంది. ఎవరో సాధారణ డైరెక్టర్ చెబితేనో, లేదా ఏదో ఆర్టికల్ రాస్తేనో భయపడే రోజులు పోయాయి. కానీ జేమ్స్ కమెరూన్ లాంటి బడా డైరెక్టర్ చేసిన పనికి హాలీవుడ్ లో కదలిక ప్రారంభమైంది. టెక్నీషియన్లు ఇలా అయితే తమ భవిష్యత్తు ఏంటి అని ఆందోళన చెందుతున్నారు. కొంతమందైతే  టైటానిక్, టెర్నినేటర్, అవతార్ ఇలా మొదటి నుంచి  జేమ్స్ కమెరూన్ వి.ఎఫ్. ఎక్స్, సి.జి ల మీద ఆధారపడి సినిమాలు తీశారు.  ప్రతి సినిమా రెండు బిలియన్ డాలర్ల మార్క్ దాటింది కద. ఆ డబ్బు చాలదా ఇంకా డబ్బు కోసం  స్టెబిలిటీ ఏ.ఐ అనే కంపెనీ బోర్డులో చేరి వి.ఎఫ్. ఎక్స్, సి.జి టెక్నీషియన్లకు ద్రోహం చేస్తున్నారు అంటూ జేమ్స్ కమెరూన్ పై కన్నెర్ర చేస్తున్నారు.

ఇదంతా ఓకే. జేమ్స్ కమెరూన్ లాంటి దర్శకుడు తన విజనరీ ప్రకారం సినిమాలు తీయాలంటే పెట్టుబడి కూడా భారీగానే వుంటుంది. అభివ్రుద్ధి చెందుతూ వస్తున్న సాంకేతిక పరిజ్నానాన్ని ద్రుష్టిలో పెట్టుకొనే జేమ్స్ కమెరూన్ ఇటీవల ఒక స్టేట్ మెంట్ ఇచ్చారు. అదే టెక్నీషియన్ల కడుపు మంటకు కారణమైంది. అదేంటంటే

భవిష్యత్తులో బ్లాక్‌బస్టర్ సినిమాలన్నీ నిలదొక్కుకోవాలంటే, VFX ఖర్చును “సగానికి తగ్గించాల్సిందే” అని చెప్పడంతో సినీ వర్గాలన్నీ ఇక జేమ్స్ కమెరూన్ ఏ.ఐ వైపు చూస్తున్నారని అర్థమైంది. అంతే కాకుండా స్టెబిలిటీ ఏ.ఐ అనే కంపెనీ బోర్డులో కూడా చేరారు ఇది టెక్ట్ టు ఇమేజ్ లాంటి జనరేటివ్ ఏ.ఐ పైన పని చేస్తుంది. అంటే మనం ఒక స్క్రిప్ట్ రాస్తూనే ఆ స్క్రిప్ట్ కు ఇమేజ్ ను క్రియేట్ చేస్తుంది అన్న మాట. దీని ద్వారా మనకు ఎలాంటి ఇమేజ్ కావాలో దానికి సంబంధించిన ఇమేజ్ ప్రాంప్ట్ ను ఇస్తే ఇమేజ్ తయారవుతుంది. అలా తయారైన ఇమేజ్ కు  వీడియో ప్రాంప్ట్ ను ఇచ్చి ఆ ఇమేజ్ మూవ్ అయ్యేలా చేసుకోవచ్చు.


జేమ్స్ కమెరూన్  స్టేట్ మెంట్ ఇచ్చి జనరేటివ్ ఏ.ఐ కంపెనీ బోర్డ్ లో చేరడంతో హాలీవుడ్ లో ఒక వర్గం దుమ్మెత్తి పోస్తున్నారు. . ఎందుకంటే ఆయన టెర్మినేటర్ సినిమాతో మనకు ఏ.ఐ గురించి చెప్పేశారు. ఆ సినిమా ఒక తరం ఏ.ఐని చూసే  దృక్పథాన్ని మార్చేసింది.  ఇప్పుడు అదే వ్యక్తి ఏ.ఐ బోర్డులో చేరి హాలీువడ్ సినిమాను ఏం చేయాలనుకుంటున్నారంటూ పత్రికల్లో బహిరంగంగానే తమ ఆక్రోశం వ్యక్తం చేశారు.  కానీ జేమ్స్ కమెరూన్ ను మనం తప్పు పట్టలేం. ఎందుకంటే ఆయన మొదట్నుంచి టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటూ టెక్నాలజీ సరిహద్దుల్లోనే తిరిగారు. అంతే కాకుండా టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని అద్భుతాలు స్రుష్టిద్దాం అనుకుంటారు కానీ వి.ఎప్. ఎక్స్ టెక్నీషియన్ల పొట్ట కొడదామని కాదు. దాని వల్ల ఆయనకు ఒరిగేది కూడా ఏమీ వుండదు.

ెందుకంటే  ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్ ను ఒక సారి చూస్తే  కథలు చెప్పే విధానం టెక్నాలజీతో కలిసే ముందుకు వెళ్తుందని అనేది నా గట్టి నమ్మకం అంటూ చెప్పడం  వెనుక ఆయన టెక్నాలజీని ఎంతగా ప్రేమిస్తారో చెప్పారు. 

క్యామెరన్ కు టెక్నాలజీ పై న ఇంట్రస్టు వుండచ్చు కానీ  మొదటి నుంచి వి.ఎఫ్. ఎక్స్, సి.జిలతో సినిమాలు రూపొందించినందుకు జేమ్స్ కమెరూన్ మా ఇంట్లో మనిషి అని మేము ఫీలయ్యాము ఇప్పుడు ఏ.ఐ తో చేతులు కలపడమే మాకు నిరాశ కలిగిస్తోంది.  ఎందుకంటే వేలాది మంది  వీఎఫ్ఎక్స్ టెక్నీషియన్లు, స్టోరీబోర్డ్ ఆర్టిస్టులు, కాన్సెప్ట్ ఆర్టిస్టులు ఇప్పటికే AI వల్ల ఒత్తిడిలో ఉన్నారు అంటూ తమ బాధ చెప్పుకుంటున్నారు.

అలాంటి వారికి  జేమ్స్ కమెరూన్ తనదైన శైలిలో సమాధానం చెప్పి కంటితుడుపు కోసం ప్రయత్నిస్తూ, మూమూలుగా అయితే నేను ఒక కంపెనీ స్థాపించి ఈ సినిమాను ఇలా చేద్దాం అని ఆలోచించే వాడిని కానీ ఈ సారి మంచి ట్రాక్ రికార్డు వున్న కంపెనీ బోర్డ్ లో చేరాను.  నాకు డబ్బు  సంపాదించడం ముఖ్యం కాదు. ఏ.ఐ రంగాన్ని అర్థం చేసుకోవడానికే ఏ.ఐ కంపెనీ బోర్డులో చేరాను. డెవలపర్స్ మదిలో ఏముంది? వారు దేన్ని టార్గెట్ చేస్తున్నారు? వారి డెవలప్ మెంట్ సైకిల్ ఎలా వుంది. కొత్త మోడల్ తయారు చేయాలంటే ఎంత పెట్టుబడి అవసరం లాంటి విషయాలు తెలుసుకొని వి.ఎఫ్ .ఎక్స్,  వర్క్ ఫ్లో లో దీన్ని ఎలా కలపాలో అర్థం చేసుకోవడమే నా ఉద్దేశ్యం.


వి.ఎఫ్. ఎక్స్ కంపెనీల్లో ఉద్యోగులను తొలగించడం నా ఉద్దేశ్యం  కాదు.  ఒక్కో షూట్ ను తక్కువ టైమ్ లో పూర్తి  చేస్తే,  అప్పుడు ఆర్టిస్టులు ఇంకా కొన్ని అద్భుతమైన ప్రాజెక్ట్ లపైన పని చేయగలుగుతారు. అనే కోణంలో చూస్తున్నాను అని అన్నారు. ఏ.ఐ  డెవలప్ మెంట్స్  టెక్నీషియన్ల నుంచే జరిపించాలి. ఇతర టెక్నీషియన్లకు ఉద్యోగాలు ఇస్తూ వుండాలి.

క్యామెరన్ వంటి విజనరీ—తన ప్రమాణాలకు తగ్గ రీతిలో  వ్యవస్థ పనిచేయాలి అనే మనిషి కాదు. అందుకే, ఆయన వాస్తవంగా దీనిని మంచి మార్గంలో నడిపించగలడు అన్న ఆశను కలిగిస్తోంది. అని పలువురు టెక్నీషియన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.