G-N7RFQXDVV7 మల్లిడి వశిష్ట తండ్రి టాలీవుడ్ పై సంచలన వాఖ్యలు

Ticker

6/recent/ticker-posts

మల్లిడి వశిష్ట తండ్రి టాలీవుడ్ పై సంచలన వాఖ్యలు

 





బింబిసార దర్శకుడు మ‌ల్లిడి వ‌శిష్ట తాజాగా మెగాస్టార్ హీరోగా విశ్వంభర చిత్రాన్ని రూపొందిస్తున్నారు.  ఆయన తండ్రి, నిర్మాత‌ అయిన  మ‌ల్లిడి స‌త్య‌నారాయ‌ణ ఇటీవ‌ల ఓ మీడియాలో ముచ్చ‌టిస్తూ  టాలీవుడ్ హీరోలపైన వరుసగా బాంబులు పేలుస్తున్నారు. పరిస్థితులను బట్టి నిర్ణయాలు మారుతూ వుంటాయి. ఒక సక్సెస్ సాధించాక వాటిని గుర్తు పెట్టుకొని ఇలా మీడియా ముందు చెప్పడం ఎంతవరకు సబబు అని కొంత మంది టాలీవుడ్ సీనియర్లు చెబుతున్నారు. అసలు విషయం ఏంటంటే

మొదట  మ‌ల్లిడి వ‌శిష్ట ద‌ర్శ‌కుడిగా అల్లు శిరీష్ హీరోగా క‌న్న‌డ నిర్మాత శైలేంద్ర‌బాబు నిర్మాణంలో ఓ సినిమా రావాల్సింది. ఇది ద‌ర్శ‌కుడిగా మ‌ల్లిడి వ‌శిష్ట‌కు తొలి సినిమా. సోషియో ఫాంట‌సీ డ్రామాగా తెర‌పైకి రావాల్సిన ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూజా కార్య‌క్ర‌మ‌యాలు కొన్నేళ్ల క్రితం అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో భారీగా జ‌రిగాయి కూడా. మ‌రో నెలరోజుల్లో రెగ్యుల‌ర్ షూటింగ్‌ని ప్రారంభించాల‌ని షెడ్యూల్ కూడా ఫైన‌ల్ చేశారు. సరిగ్గా అదే సమయంలో ప‌ర‌శురామ్ ద‌ర్శ‌కుడిగా గీతా ఆర్ట్స్‌పై నిర్మించిన `శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు` విడుదల అయ్యి హిట్ అవ్వడంతో. , త‌న త‌న‌యుడు మ‌ల్లిడి వ‌శిష్ట ప్రాజెక్ట్‌పై అల్లు శిరీష్ మ‌న‌సు మార్చుకున్నాడ‌ని, ఈ టైమ్‌లో ఈ ప్రాజెక్ట్ చేయ‌లేని చెప్పేసి షాక్ ఇచ్చాడ‌ని మ‌ల్లిడి స‌త్య‌నారాయ‌ణ సంచ‌ల‌న విష‌యాల‌న్ని బ‌య‌ట‌పెట్టారు. క్లోజ్ ఫ్రెండ్ సినిమాని ఆపేసిన అల్లు శిరీష్ ఆ క్రేజ్‌తో వి.ఐ. ఆనంద్ సినిమాకు వెళ్లిపోయి మ‌ల్లిడి వ‌శిష్ట‌ని అవ‌మానించాడ‌ని, అల్లు అర‌వింద్ ఇలా చేయ‌డం క‌రెక్ట్ కాద‌ని వాదించినా శిరీష్ ప‌ట్టించుకోలేద‌ని, అయితే మ‌రో క‌థ‌తో వ‌స్తే ఆ సినిమాని తాను నిర్మిస్తాన‌ని అల్లు అర‌వింద్ మాటిచ్చార‌ని, కానీ స్నేహితుడు శిరీష్ త‌నతో ప్రాజెక్ట్‌ని ప్రారంభంలోనే నిలిపివేయ‌డంతో నా త‌న‌యుడు వ‌శిష్ట హ‌ర్ట్ అయ్యాడ‌ని తెలిపారు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.

ఇక పోతే  హీరో నితిన్ గురించి చెబుతూ, నితిన్ తండ్రి సుధాక‌ర్ రెడ్డి త‌మ‌ను ఎలా మోసం చేశాడో వివ‌రించ‌డం గ‌మ‌నార్హం.వ‌శిష్ఠ‌ ద‌ర్శ‌కుడిగా ప్ర‌య‌త్నాలు చేస్తున్న స‌మ‌యంలో సుధాక‌ర్ రెడ్డి.. నితిన్‌తో సినిమా చేయ‌మ‌ని అడిగాడ‌ట‌. ఆ చిత్రానికి నిర్మాత‌ను కూడా మేమే తెచ్చుకున్నాం.. నితిన్‌కు రూ.75 ల‌క్ష‌లు, సినిమాటోగ్రాఫ‌ర్ ఛోటా కే నాయుడికి రూ.10 ల‌క్ష‌లు అడ్వాన్స్ కూడా ఇచ్చాం.  వ‌శిష్ఠ చెప్పిన క‌థ నచ్చలేదని చెప్పడంతో  వేరొక‌రి ద‌గ్గ‌ర్నుంచి క‌థను  కూడా మాతో కొనిపించారు. ఇలా మొత్తం మాకు దాదాపు .2 కోట్ల దాకా ఖ‌ర్చ‌యింది.. నాకు ప‌రిచ‌య‌మున్న మిత్రుడి నిర్మాణ సంస్థలో  ఈ సినిమా చేయ‌డానికి అంతా సిద్ధం చేసుకున్నామ‌ని స‌త్య‌నారాయ‌ణ తెలిపారు. ఐతే ఇంత‌లో నితిన్ హీరోగా నటించిన ’అఆ‘ సినిమా విడుదలై పెద్ద హిట్ట‌యింది.. దీంతో నితిన్, ఆయ‌న తండ్రి మ‌న‌సు మారిపోయింద‌ని ఆయ‌న చెప్పారు. నితిన్ రేంజ్ పెరిగిపోయిన నేప‌థ్యంలో కొత్త ద‌ర్శ‌కుడితో సినిమా చేస్తే బాగుండ‌ద‌ని భావించి.. మేము తీసుకెళ్లిన నిర్మాతనే పిలిచి పూరి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌డానికి డ‌బ్బులు పెట్టమని అడిగారు.. కానీ ఆయ‌న అందుకు అంగీక‌రించ‌కుండా డ‌బ్బులు వెన‌క్కి ఇచ్చేయ‌మ‌ని చెప్పేశారు.  అప్పుడు మా అబ్బాయి సినిమాను ప‌క్క‌న పెట్టి నితిన్ చేసిన సినిమానే హార్ట్ ఎటాక్ అని తెలిపారు.

విశ్వంభర లాంటి సినిమాను డైరెక్ట్ చేస్తున్న వశిష్ఠకు మంచి ఫ్యూచర్ వుంది. ఇలాంటి సమయంలో పాత జ్నాపకాలు తవ్వుకొని శత్రుత్వం పెంచుకుంటూ పోతే వశిష్ఠ భవిష్యత్తు ఇబ్బందులో పడుతుంది కద. ఇప్పడవన్నీ తవ్వుకొని ఉపయోగం ఏంటి? అని టాలీవుడ్ పెద్దలు సద్విమర్శలు చేస్తున్నారు.