మలయాళ హీరోయిన్ అనుపమ కార్తికేయ 2 వరకు మంచి హిట్లు మెయింటెయిన్ చేస్తూ వచ్చింది. కానీ సడన్ గా ఎందుకో ఆమె సినిమా గ్రాఫ్ తెలుగులో పడిపోయింది. గత సంవత్సరం టిల్లు స్కయర్ హిట్ యినా అనుపమ కు లాభం చేకూరలేదు. పబ్లిక్ మూడ్ అంతా టిల్లు మీదనే వున్నందున అనుపమను ప్రేక్షకులు పట్టించుకోలేదు. స్వహతాగా టిల్లు మొదటి భాగం డైలాగుల మూలంగానే సక్సెస్ అయ్యింది. దాని సీక్వెల్ అన్నప్పుడు మొదటి భాగం ద్రుష్టిలో పెట్టుకొనే ఆడియన్ మూడ్ కూడా వుంటుంది. కాబట్టి అనుపమ కు పెద్దగా లాభించలేదు. ఆ తర్వాత అనుపమను అవకాశాలు పలకరించడమే మానేశాయి. రీసెంట్ గా డ్రాగన్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. కానీ ఆ సినిమాలో అనుపమ కన్నా కయదు లోహార్ కి ఎక్కువ పేరు వచ్చింది. ఇక తెలుగులో అనుపమ కెరీర్ దాదాపు అయిపోయినట్టే అని అందరూ అనుకున్నారు కానీ బెల్లం కొండ సాయి శ్రీనివాస్ హీరోగా చేస్తున్న కిష్కింధపురి సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. దీనికి సంబంధించిన ఒక పోస్టర్ ను కూడా విడుదల చేశారు. గతంలో సాయి శ్రీనివాస్ తో కలిసి రాక్షసుడు సినిమాలో నటించి మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం అనుపమ టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. శర్వానంద్ హీరోగా సంపత్ నంది కాంబినేషన్ లో వస్తున్న పీరియాడికల్ మూవీలో అనుపమ పరమేశ్వర్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఈ మధ్యనే ఓదెల 2 సినిమాతో హడావిడి చేసిన సంపత్ నంది శర్వానంద్ తో చేయబోయే సినిమా చాలా ఇంట్రస్టింగ్ గా వుంటుందని చెబుతున్నారు. 1965 కాలం నాటి కథతో వస్తున్న ఈ సినిమాలో శర్వానంద్ కొత్తగా కనిపిస్తారని శర్వానంద్ చెబుతున్నారు. పీరియాడికల్ మూవీ కాబట్టి దీనిపై అనుపమ అంచనాలు పెట్టుకుందని సోషల్ మీడియాలో పలువురు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇటీవల తమళ నాట కూడా అనుపమ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి వచ్చింది. చియాన్ విక్రమ్ తనయుడితో అనుపమ ప్రేమ కలాపాలు సాగిస్తోందంటూ తమిళ మీడియా కొద్ది రోజుల పాటు వార్తలు ప్రచురిస్తూనే వుంది. ఏది ఏమైనా సంపత్ నంది సినిమాతో అనుపమ బౌన్స్ బ్యాక్ అవుతుందని అంటున్నారు. మలయాళంలో కూడా పెట్ డిటెక్టివ్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమాను కూడా తెలుగులో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది.
Social Plugin