ఒక తరంలో ఊర్వశి శారద గురించి తెలియని ప్రేక్షకులు వుండరు. కానీ ఈ తరం వారికి నాటి నటీనటుల గురించి తెలియజేయడానికి Cinema reporter చేస్తున్న చిన్న ప్రయత్నమే ఇది. ఈ ఎపిసోడ్ లో ముందుగా ఊర్వశి శారద గారి గురించి చెప్పే ప్రయత్నం చేశాం. ఆమె అంతకు ముందు ఇచ్చిన ఇంటర్వూల ఆధారంగా తయారు చేసిన చిన్న పాటి కథనం మీ కోసం.
హరిశ్చంద్రుడు, శకుంతల లాంటి పేర్లను మనం మరచిపోలేము. కారణం వాళ్ళ జీవితాల్లో అధికంగా విషాదమే ప్రతిబింబించింది. విషాద పూరితమైన పాత్రలే ప్రేక్షకుల మనసుల్లో చిరకాలం నిలిచిపోతాయన్నది సత్యదూరం కాదు. ప్రముఖ నటీమణి ఊర్వశి శారద ఎక్కువగా విషాదమూ, సృజనాత్మకమూ అయిన పాత్రలే నటించడంవల్ల అప్పట్లో అభిమానులు ఊర్వశి శారద నటనను అభినందిస్తూ విశేషంగా ఆదరించారు.,
" తులాభారం ” చిత్రం మొదట మలయాళం లోనూ, తర్వాత తమిళం, తెలుగు, హిందీ భాష
ల్లోనూ వచ్చింది. ఈ నాలుగు భాషల్లోనూ ఊర్వశి శారద గారే కధానాయికగా నటించారు. మలయాళం 'తులాభారం' లో ఆమె నటనకు భారత ప్రభుత్వం ఇచ్చిన 'ఊర్వశి' బిరుదు ప్రధానం చేసింది. అయితే ఆ బిరుదును స్వీకరించినప్పటికంటే, ఆ చిత్రాన్ని ప్రేక్షకుల మధ్య కూర్చుని, వాళ్ళు పొందుతున్న అనుభవం, ఆవేదనా ప్రత్యక్షంగా చూసినప్పుడే —నా కెంతో తృప్తి కలిగింది అని ఒకానొక సందర్భంలో శారద గారే స్వయంగా చెప్పారు..
'తులాభారం' చిత్రాన్ని తెలుగులో "మనుషులు మారాలి" పేరిట నిర్మించి, విడుదల చేసి నప్పుడు నిర్మాతలు ఒక అడ్వర్టైజ్ మెంట్ ఇచ్చారు. అదేమిటంటే చిత్రంలోని హీరోయిన్ సినిమాలో పడే బాధల సమాహారాన్ని రాసి, ఇది చదివి దీనికి ముగింపు మీరే చెప్పండి అని ఒక పాంప్లెట్ తయారు చేసి ఇంటింటికీ పంపించారు. అది చూశాక చాలా మంది అభిమానులు ఒక విధమైన సంఘర్షణకు లోనయ్యారు. శారద అలాంటి విషాద పరిస్థితుల్లో వుందని భావించి ఏకంగా థియేటర్ల దగ్గరికి వచ్చి శారద మాకు ఇలా లెటర్ రాసింది అంటూ ఆ పాంప్లెట్ పట్టుకొని వచ్చి మేము ఆమెను తక్షణమే చూడాలి అంటూ హడావిడి చేశారట. టికెట్ లేకుండా లోనికి వెళ్లడానికి ప్రయత్నించారట.
శారద సొంత పూరైన తెనాలిలో కొందరు అభిమానులు ఆ కరపత్రాన్ని శారద అన్నదమ్ములకు చూపిస్తూ, "శారద సినిమాల్లో బాగానే నటిస్తోంది కద.......పాపం ఇన్ని కష్టాలు ఎలా కలిగాయి? మీరు వెళ్ళి చూడలేదా" అని అడిగారట. " అదంతా ఒక ప్రకటన మాత్రమే" అని శారద సోదరులు బాగా వివరించిన తర్వాతగానీ వారికి తృప్తి కలగలేదట :
ఆంధ్రప్రదేశ్ లో ఆ చిత్రాన్ని చూస్తూ కొందరు మైకం వచ్చి పడిపోయారని అప్పట్లో వార్తలు వచ్చాయి. కొందరికి 'హార్ట్ ఎటాక్' వచ్చిందట. కొన్ని థియేటర్లలో ఇలాంటి పేవన్నా జరిగితే వెంటనే చూడడానికి, నర్సులను కూడా నియమించారట . ఇలాంటి సందర్భంలో శారద ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో తను చూసిన సంఘటనను వివరించింది. అదేంటంటే
శారద స్వంత ఊరికి వెళ్లిన సందర్భంలో విజయవాడలో 'మనుషులు మారాలి' చిత్రం ప్రత్యేకించి స్త్రీల కోసమే ఆ రోజు ఒక థియేటర్లో ప్రదర్శిస్తున్నారట. సాధ్యమైనంతవరకూ తెలియకుండా వుండాలని శారద కొంగు తల చుట్టూ వేసుకుని, ఒక సీట్లో కూర్చున్నదట. థియేటర్ నిండా స్త్రీలూ, పిల్లలూ మాత్రమే వున్నారు. పురుషులు ఎక్కడా లేరు. ఆమె పక్కన ఎవరో ముసలావిడ కూర్చునివుందట. కొంత సేపు అయేటప్పటికి ధియేటర్లో చాలామంది ఏడుస్తున్నట్లు......అ క్కడక్కడా వెక్కిళ్ళ శబ్దాలు వినబడసాగాయి అట. తల్లి, పిల్లలకు విషం కలిపే దృశ్యం వచ్చింది. శారద పక్కన కూర్చున్న ముసలావిడ గట్టిగా ఏడుస్తూ, " అయ్యో... నా తల్లీ... ఎందుకమ్మా ఖర్మ? ? మా యింటికి వస్తే నేనన్నా అన్నం పెడతాను కదా..." అని తల్లడిల్లి పోసాగిందట. శారదకు ఒళ్ళు జలదరించిందట. హృదయాన్ని ఎవరో దేవినట్లయిందట. కళ్ళలో నీళ్ళు తిరిగాయి అట. అదంతా నిజమనుకుని ప్రేక్ష కులు ఎంత బాధపడుతున్నారు.. తలచుకుంటున్న కొద్దీ శారద మనసులో కలవరం అధికమవుతూ పోయిందట
బొంబాయిలో 'సమాజ్ కో బదల్ దాలో ' (*మనుషులు మారాలి' హిందీ) స్రీవ్యూ ప్రదర్శ నకు, కధానాయకుడుగా నటించిన శ్రీ అజయ్ సహాని తల్లిగారు (ప్రసిద్ధ హిందీ నటుడు బాల రాజ్ సహాని భార్య) కూడా వచ్చారు. చిత్రం ముగిశాక, ఆమె శారద చేతులు పట్టుకుని ఒక ప్రక్క వెక్కి వెక్కి ఏడుస్తూనే "నువ్వు బాగా నటించావు" అని అభినందించారట. ఒక ప్రఖ్యాత నటుని భార్యే అంత 'ఏమోషనల్'గా ఫీలవుతూ శారదను అభినందించేటప్పటికి, బరు వెక్కిసి హృదయంతో, బాష్పాలు నిండిన నేత్రా లతో శారద కృతజ్ఞతలు తెలియజేసుకుందట. అప్పటి నుంచి....సినిమా నటనను ఎప్పుడో ఒకసారి ప్రేక్షకుల మధ్య కూర్చుంటేనే వారి రియాక్షన్ ను గమనించడానికి వీలవుతుందని భావించిందట. నాటకాలలో అయితే, వాళ్ళ ఈలలు, చప్పట్ల ద్వారా, అప్పటికప్పుడే ఏ సంగతీ తెలిసిపోతుంది. 'మనుషులు మారాలి'లో శారద నటన.. ఆమెకు ఎందరో అభిమానులను తెచ్చిపెట్టింది. ఆమె నటన ఇతరుల పై ఎన్నో కోణాలలో ప్రతిఫలించింది. ఉదాహర ణకు 'మనుషులు మారాలి' విడుదలయిన రోజుల్లో పిల్లలు శారదను చూసి భయపడేవారు.... కారణం పిల్లలకు విషం ఇచ్చే దృశ్యం. ఆ లేత మనసుల్లో బాగా నాటుకునిపోయి వుండడం. దీన్ని తలచుకొని ఆమె అప్పుడు చాలా ఆవేదన కు గురైందట. .
సమయం దాటిపోవడం మూలంగా ఈ వారం ఇంతటితో ముగిస్తున్నాను. వచ్చే వారం మనం ఊర్వశి శారద గారి బిరుదు ప్రధానోత్సవం రోజు ఏం జరిగింది? శారద గారి గురించి అసలు విషయం తెలసుకొని జెమినీ బాలసుబ్రమణ్యం ఎందుకు ఆశ్చర్యపోయారు అనే అంశాలు మరో ఎపిసోడ్ లో చర్చించుకుందాం.
Social Plugin