G-N7RFQXDVV7
సూర్య హీరోగా నటించిన రెట్రో రియల్ రివ్యూ
Home
Home
Languages
_South Film Industry
_Tamil
_Malayalam
Special Stories
Direction lessions
Ticker
6/recent/ticker-posts
హోమ్
సూర్య హీరోగా నటించిన రెట్రో రియల్ రివ్యూ
సూర్య హీరోగా నటించిన రెట్రో రియల్ రివ్యూ
News Reporter
మే 01, 2025
సూర్య హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన చిత్రమే ‘రెట్రో’. సూర్య నుంచి కంబ్యాక్ సినిమా అవుతుంది అనిపించేలా ఒక ఇంట్రెస్టింగ్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ లో తెలుసుకుందాం.
కథ విషయానికి వస్తే
ఈ చిత్రం 1993 సమయంలో జరిగే కథ కాగా, తన చిన్నతనంలోనే పారివేల్ కణ్ణన్ తన తల్లిదండ్రుల నుంచి వేరయ్యి ఒక గ్యాంగ్ స్టర్ తిలక్ రాజ్ కి దొరుకుతాడు. అయితే అతని భార్య కోరికతో పెంచుకుంటాడు కానీ పారి అంటే ఇష్టం ఉండదు. తను దొరికిన పరిస్థితులుతో పారికి చిన్నతనం నుంచి నవ్వు అనేది ఉండదు. ఆ తర్వాత రుక్మిణి తో జరిగిన పరిచయం ఎలా ప్రేమగా మారింది. ఈ క్రమంలో తన కోపం, నవ్వు పారి జీవితంలో ఎలాంటి పాత్ర పోషించాయి. అసలు ఈ పారి ఎవరు? ఏ ప్రాంతానికి చెందినవాడు? ఈ మొత్తంలో అండమాన్ లో ఒక దీవిలో ప్రజలని బానిసలుగా చేసిన దొరలు రాజ్ వేల్, తన కొడుకు మైఖేల్ లు చేసే అరాచకాలు ఏంటి? అక్కడికి పారి ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది? అలాగే తిలక్ రాజ్ కోరుకుంటున్న గోల్డ్ ఫిష్ కి పారికి ఉన్న లింక్ ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి.
ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే
ఈ సినిమాలో ఫస్టాఫ్ మంచి బలం అని చెప్పవచ్చు. మేకర్స్ అనౌన్స్ చేసిన లవ్, లాఫ్టర్ , వార్ ఈ పాయింట్స్ కి తగ్గట్టుగా నడిపిన కథనం మంచి ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఈ క్రమంలో సూర్య నటన కూడా సాలిడ్ గా ఉందని చెప్పవచ్చు.
తన లోని నటుణ్ని మిస్ అవుతున్న వారికి చాలా కాలం తర్వాత ఈ సినిమా ఫస్టాఫ్ లో అలాగే తనలో ఉన్న లోపంని అద్దంలో చూసుకునే సీక్వెన్స్ లో సూర్య జీవించేశారు అని చెప్పడంలో సందేహం లేదు. అలాగే తనపై పలు క్రేజీ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ కూడా బాగున్నాయి. ఇంకా కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా బాగున్నాయి.
ఇంకా పూజా హెగ్డే తన రోల్ లో బానే చేసింది. వీరితో పాటుగా జోజు జార్జ్ ఇంకా జై రాం లు తమ గత సినిమాలు నుంచి కొంచెం డిఫరెంట్ పాత్రల్లో కనిపించి మెప్పిస్తారు. అలాగే నెగిటివ్ రోల్ లో కనిపించిన యంగ్ నటుడు విదు తన పాత్రలో మంచి పెర్ఫామెన్స్ ని అందించాడు. అలాగే దర్శకుడు ఎంచుకున్న పాయింట్ అందుకు తగ్గ కొన్ని కనెక్షన్ లు అలాగే ఫస్టాఫ్ లో ఒక సింగిల్ టేక్ సీక్వెన్స్ మొత్తం ఆడియెన్స్ ని ఆకట్టుకుంటాయి.
మైనస్ పాయింట్స్ తీసుకుంటే…
దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ మరోసారి సెకండాఫ్ ని ఎంగేజింగ్ గా నడపడంలో తడబడ్డారు అని చెప్పక తప్పదు. ఒక డీసెంట్ ఫస్టాఫ్ ని కొనసాగించి యుద్ధంతో ఇంట్రెస్టింగ్ లీడ్ ఇచ్చి సెకండాఫ్ కి మంచి స్కోప్ ని హోప్ ని ఇచ్చేలా సెట్ చేసి సెకండాఫ్ ని మాత్రం డల్ గా సాగదీతగా నడిపించారు.
కథ ఒకలా మొదలై అది కాస్తా ఏటెటో వెళుతుంది. వీటితో ఆడియెన్స్ ఏకాగ్రత తప్పుతుంది. సూర్యపై కొన్ని సీన్స్ బాగానే అనిపిస్తాయి కానీ అవన్నీ ఫ్లోలో కరెక్ట్ గా లేవు అనిపించక మానదు. అలాగే ప్రీ క్లైమాక్స్ సూర్యపై ట్విస్ట్ వచ్చే వరకు కథనం అంతా చప్పగా సాగుతున్నట్టు అనిపిస్తుంది. అలాగే చాలా సీన్స్ ఆడియెన్స్ కి ఇది వరకే ఎక్కడో చూసినట్టే అనిపిస్తాయి.
అంతే కాకుండా అక్కడక్కడా సన్నివేశాలు ఈజీగా ఊహించే రేంజ్ లోనే కొనసాగుతాయి. మరో డ్రా బ్యాక్ ఏదన్నా ఉంది అంటే క్లైమాక్స్ కూడా అని చెప్పొచ్చు. కార్తిక్ సుబ్బరాజ్ అనుకున్న పాయింట్ కి ప్లాన్ చేసుకున్న క్లైమాక్స్ అంత ఎఫెక్టీవ్ గా అయితే అనిపించలేదు. అప్పుడు వరకు అంతా స్ట్రాంగ్ గా ఉన్న విలన్లు చాలా ఈజీగా లొంగిపోయినట్టు అనిపిస్తుంది. వీటితో చాలా అంశాలు మాత్రం సెకండాఫ్ లో డిజప్పాయింట్ చేస్తాయి.
సాంకేతిక వర్గం గురించి మాట్లాడుకుంటే
ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. సంతోష్ నారాయణన్ తన సంగీతంతో చాలా సీన్స్ కి మంచి స్కోర్ అందించి ఎలివేట్ చేసాడు. అక్కడక్కడా కాలా సినిమా స్కోర్ కూడా కొట్టేసాడు. శ్రేయస్ కృష్ణ, సినిమాటోగ్రఫీ బాగుంది. నేపథ్యంకి తగ్గట్టుగా మంచి రెట్రో విజువల్స్ అందించారు. ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్ గా డిజైన్ చేయాల్సింది. తెలుగు డబ్బింగ్ విలువలు బాగున్నాయి. తీసుకున్న జాగ్రత్తలు హర్షణీయం.
ఇక దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ విషయానికి వస్తే తను ఎంచుకున్న లైన్ అందులో పాయింట్స్ బాగున్నాయి కానీ వాటికి అనుగుణంగా రాసుకున్న కథనం మాత్రం ఆకట్టుకునేలా లేదు. మెయిన్ గా సెకండాఫ్ వీక్ గా సాగింది. ఎక్కడో ప్రీ క్లైమాక్స్ లో కలిపిన లింక్ ఒకే కానీ పూర్తి స్థాయిలో ఆడియెన్స్ ని ఎంగేజ్ చేయగలిగే రేంజ్ లో అయితే తన వర్క్ సాగలేదు. ఫస్టాఫ్ వరకు మాత్రం తన మార్క్ కనిపించింది.
ఇక మొత్తంగా చూసుకున్నట్టైతే ఈ “రెట్రో” సినిమాలో మంచి కీ పాయింట్స్ కనిపిస్తాయి అలాగే సూర్య సాలిడ్ పెర్ఫామెన్స్ తో సినిమాకి మెయిన్ పిల్లర్ గా నిలిచారు కానీ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ మాత్రం కథనం ఆసక్తిగా నడపలేదు. ఫస్టాఫ్ వరకు తన వర్క్ ఓకే కానీ సెకండాఫ్ లో మాత్రం తన కథనం ఆడియెన్స్ కి రుచించదు. సో వీటితో సూర్య అభిమానులు వరకు చాలా తక్కువ అంచనాలు పెట్టుకొని ట్రై చేస్తే మంచిది.
Social Plugin
Prime pages
Odela 2 Movie Review
చక్రి వాయిస్ విని కొత్త గాయకులకు దడ
బాలీవుడ్ రామాయణ్ పై తెలుగు వాళ్లు సీరియస్
రాజమౌళి, సుకుమార్ లలో ఎవరు తోపు
ఓదెల 2 బిజినెస్ లెక్కల్లో లొల్లి
రాజేష్ టచ్ రివర్ దర్శకత్వ పాఠాలు
అల్లు అర్జున్ చేయకపోతే నా దుకాణం నాకుంది
థగ్ లైఫ్ వేడుకలో త్రిష కాంట్రావర్సీ స్టేట్ మెంట్
నితిన్ సినిమా తమ్ముడు పాయింట్ లీక్
Arjun S/O Vyjayanthi Movie Review
Most Popular
ప్రపంచ వ్యాప్తంగా చిన్న సినిమా బిజినెస్ చెయ్యచ్చు కానీ
మే 17, 2025
గిలిగింతలు పెడుతున్న అంకితా మిశ్రా ఫోటోలు
మే 09, 2025
అనుపమ పరమేశ్వర్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా
ఏప్రిల్ 28, 2025
శ్రీకాంత్ అయ్యంగార్ లో ఈ యాంగిల్ ఏంటి?
ఏప్రిల్ 28, 2025
చిలసౌ చిత్ర హీరోయిన్ రుహానీ శర్మ వైరల్ అవుతున్న ఫోటోలు
ఏప్రిల్ 26, 2025
Labels
Film news
(45)
know your cinema
(8)
director lessions
(7)
Question and answers
(3)
cinema jokes
(3)
Categories
cinema jokes
(3)
director lessions
(7)
Film news
(45)
know your cinema
(8)
Question and answers
(3)
Contact form
Social Plugin