మొదట్నుంచి సినిమా ఇండస్ట్రీ పైన పుకార్లు, గాసిప్స్ తోనే పలు పత్రికలు పుట్టుకొచ్చాయి. స్క్రీన్ మీద అందంగా, దగ్గరగా కనిపించే హీరోయిన్ల, హీరోల అంతరంగ విషయాలపైన పబ్లిక్ కు వున్న ఇంట్రస్ట్ ను పత్రికలు, వెబ్ సైట్స్ క్యాష్ చేసుకోవడం మామూలే. అలాంటి కోవలోనే ఇప్పుడు మెగా కోడలు లావణ్య త్రిపాఠి, అలాగే అక్కినేని వారి కోడలు శోభితా ధూళిపాళ ఇద్దరూ ప్రెగ్నెంట్స్ అంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే అది ఎంతవరకు నిజం అనేది మనం తెలుసుకుందాం.
సాధారణంగా ఇలాంటి పుకార్లు బాలీవుడ్ లో బాగా వినిపించేవి. అది కాస్త తగ్గి సోషల్ మీడియా వచ్చాక
ఆ సంస్క్రుతి టాలీవుడ్ కు కూడా వ్యాపించింది. ఇక వివరాల్లోకి వెళితే నాగబాబు తనయుడు వరుణ్ తేజ్,
లావణ్య త్రిపాఠి ఇద్దరూ ఆరేళ్ల పాటు రిలేషన్లో వున్నారు. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి ఇద్దరు 2023 లో పెళ్లి చేసుకున్నారు.
లావణ్య త్రిపాఠి ఇప్పుడు ఓ బిడ్డను కనబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ విషయం పై మెగా ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటున్నారు.
కొంతమందైతే ఏకంగా విషెస్ కూడా చెబుతున్నారు. అయితే పెళ్లయిన తర్వాత కూడా లావణ్య త్రిపాఠి తన
ప్రొఫెషన్ ను కంటిన్యూ చేస్తూనే వున్నారు. ఇటీవల లావణ్య షూటింగ్ లో కొంత బ్రేక్ తీసుకున్నారు.
దీంతో మెగా ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ కు అర్థం దొరికినట్టయ్యింది. ఆమె ప్రెగ్నెంట్ కాబట్టే బ్రేక్ తీసుకున్నారంటూ
మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నారు. ఇక పోతే అక్కినేని నాగ చైతన్య, శోభితా ధూళిపాల
డిసెంబర్ లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే అయితే ఇప్పుడు నాగచైతన్య కూడా తండ్రి కాబోతున్నారంటూ
వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇటీవల నాగచైతన్య ఇన్ స్టాలో క్యాప్షన్ ఏమీ లేకుండా,
ఎలాంటి క్లూ ఇవ్వకుండా శోభితా ధూళిపాళ ఫోటోలు కొన్ని షేర్ చేశారు. దీంతో అక్కినేని అభిమానులు కూడా
శోభిత ప్రెగ్నెంట్ అనే విషయాన్ని కన్ ఫామ్ చేసేశారు. శోభిత ఈ మధ్య తన కెరీర్ ను లైట్ గా తీసుకోవడం
. ఇటీవల జరిగిన ఓ సమ్మిట్ లో శోభిత నాగ చైతన్యతో కలిసి కనిపించినప్పుడు చీర కట్టుకొని కాస్త భిన్నంగా
కనిపించడంతో , శోభిత ప్రెగ్నెంట్ అనే విషయం పుకారు కాదు నిజమే అని అభిమానులు
చర్చించుకుంటున్నారు. అంతే కాదు శోభిత తన కెరీర్ ను లైట్ తీసుకోవడంపై అక్కినేని ఫ్యాన్స్
సెలబ్రేట్ చేసుకుంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Social Plugin