సినిమా చరిత్రను తెలుసుకోండి అంటూ సినిమా రిపోర్టర్ పలు స్పెషల్ స్టోరీలను తెలుగు సినీ ప్రేక్షకులకు అందిస్తున్న విషయం తెలిసిందే.. అయితే అప్పట్లో యాక్షన్ , క్రైమ్ సినిమాల స్పెషలిస్ట్ కే.ఎస్.ఆర్ దాస్ రూపొందించిన మోసగాళ్లకు మోసగాడు చిత్రం తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈ చిత్రం చూశాక చాలా మంది సినీ విశ్లేషకులు, ఇందులో క్రైమ్ ఎక్కువగా వుంది. ఆయన చిత్రాలు యువతను పెడదోవ పట్టిస్తున్నాయి అంటూ రాశారు. దానికి ఆయన అంతరంగాన్ని వ్యక్తపరుస్తూ 1971లో ఓ ఇంటర్వూలో చెప్పారు. ఆయన అంతరంగం యథాతంగా… మీ కోసం.
ఆరోజు ఇంట్లో కూర్చుని ఏదో ఆలోచిసు న్నాను. పిల్ల లెవరో గోల చేస్తున్నట్లు వినబడ డంతో చికాగ్గా బయటికి వచ్చి చూశాను. - ఒక చిన్న కుర్రవాడు చేతిలో ఓ పుల్ల పట్టు కుని అవతలి కుర్రాడిని • హేండ్స్ ఆప్ ' అని బెదిరిస్తున్నాడు. ఆ కుర్రాడు భయపడుతున్నట్లుగా మొహం పెట్టి అకస్మాత్తుగా ఆపుల్ల లాక్కుని * డిష్ ' అని తానే అంటూ ఒక్కటిచ్చాడు. రెండో కుర్రాడు కూడా • డిష్.... డిష్.... . అంటూ చేతులు ఆడించసాగాడు. మిగతా కుర్ర వాళ్ళు ఈ వినోదాన్ని ఆనందంగా చూస్తూ.... ఉత్సాహం ఎక్కువైనప్పుడల్లా మధ్య మధ్య ఏవేవో కేకలు పెడుతున్నారు. అంత చికాకులోనూ నాకు నవ్వొచ్చింది. ఈ కుర్రాళ్ళు నిజంగా పిస్టల్ తీసుకొచ్చి, కాల్చి చూపించినా భయపడరనుకుంటాను. వినోద రూపంలో ఒకరకమైన బలవంతపు ధైర్యం ఇలా పిల్లల్లో రూపొందటానికి ముఖ్య కారణం ఒక రకంగా సంట్ సినిమాలంటే అందులో అతిశ యోక్తి ఏమీ లేదు ! కేవలం వినోదం కోసం అని ఇలాంటి స్టంటు, • కైమ్ ' చిత్రాలు నిర్మిస్తున్నప్పుడు “ అందులో వా స్తవికత లేదు; అటువంటి పాత్రలూ సంఘ టనలూ అన్నీ అభూతకల్పనలే" అని కొందరంటూ వుంటారు. నిజమే. వినోదాన్ని అందించేటప్పుడు అది ఏ రూపంలో ఎలా_కొత్తదనంతో ఆకరణీయంగా చూపగలం - అనే మేము ఆలోచిసుంటాము కాని ఇక్కడ " సమకాలీన సమాజమూ.వాస్తవికత " అన్న ప్రసక్తే లేదు. ఈ వినోద చిత్రాల నిర్మాణం ఎప్పుడో పాశ్చాత్య దేశాలలో ప్రారంభమై, క్రమక్రమంగా మన వారినీ ఆకరించింది. ఆ రోజుల్లో నాడియా, , జాన్ కావాస్ చిత్రాలను పిల్లలు, పెద్దవాళ్ళు కూడా బాగా ఆదరించేవారు. వేగంతో కూడిన యాక్షనూ, రకరకాల పదతులో చేసే ఫీట్లు ఈ చిత్రాలలోని ముఖ్యమైన ఆకరణలు : అందులో వెరెటీకోసం రెలు మీద దెబ్బలాటలు, గుర్రాల స్వారీ, కత్తి యుద్దాలు మొదలైనవి వుండేవి. వాసవికతకు భిన్నంగా వుండటం వల్ల నే ఈ చిత్రాల పట ఆకరణ పెరుగుతూ రాసాగింది. ఒక విధంగా జానపద చిత్రాలకూ, వీటికీ అట్లే భేదం లేదు. కాస్యూమ్సు, సంభాషణల తేడా తప్ప రెండింటిలోనూ ప్రధానంగా వుండేది • ఏక్షన్ ' మాత్రమే. ఇప్పుడిప్పుడు పాశ్చాత్య చిత్రాల ప్రభావం వల్ల సెక్సప్పీలుకు కూడా ఎక్కువ ప్రాధాన్యత వచ్చింది. ఒక ఒరవడి చిత్రాలు వరసగా రావడం: వాటిని చూసినంత వరకూ చూసి విసుగెతి ఆ తర్వాత ప్రేక్షకులు ఆదరించకపోవడం, మళ్ళి ఇంకొక రకం చిత్రాలు రావడం సహజంగా జరిగే విషయమే. మొన్న మొన్న వరకూ వచ్చిన జానపద చిత్రాల పరిస్థితి కూడా అలాగే అయింది. కొన్నాళ్ళకు క్రైమ్' చిత్రాల పరిస్థితి కూడా అంతే అయినా మనం ఆశ్చర్యపడవలసిన అవసరంలేదు. - ఇక పోతే ఈ క్రైమ్ చిత్రాలు చూడడం వల్ల యువకుల్లో దొంగతనాలు, దోపిడీలపట్ల ఆసక్తి కలిగి, చెడిపోయే ప్రమాదం కూడా వుందని కొందరు తరచు అంటున్న మాట. చిత్రాల్లో మంచి పాత్రలను చూసినంత మాత్రాన చెడ్డవాళ్ళు' మంచి వాళ్ళయి పోతారనుకోవడం ఎంత అసమంజసమో చెడ్డ పాత్రలను చూసి మంచివాళ్ళు చెడిపోవడం కూడా అంతే అవుతుంది. పైగా మేము ఈ చిత్రా లోని దొంగలు, దోపిడీదారులు ఎన్ని ఎతులు వేసినట్లు చూపిస్తున్నామో అన్నిటికీ కథానాయ కుడుగాని, అధికారులు కాని పై ఎత్తులు వేస్తు న్నట్లూ చివరికి నేరస్తులు న్యాయానికి, ధర్మానికి బందీలు అయినట్టూ మంచికే అంతిమ విజయ మనీ చూపిస్తున్నాము. కాబట్టి ఏదో ఎక్కడో ' ఆరుదుగా జరిగే ఒక సంభవాన్ని ఉదాహరణగా తీసుకుని ఈ చిత్రాలు దుష్పలితాలను తీసుకురా గలవంటే నేనంగీకరించను. మరో ప్రక్క చూసే ఈ చిత్రాలకు సెన్సా రింగ్ విధానాలు కూడా విచిత్రంగా వున్నాయి. * పిస్టల్'తో కాల్చినట్లు చూపిస్తే, ఒకసారి • షూట్ ' చేయగానే అవతలి వ్యక్తి చనిపోయి నటు చూపాలనీ, రెండు మూడుసార్లు పేల్చినట్లు చూపి సే క్రూరంగా వుంటుందని అంటుంటారు. ఆలాగే • క్లబ్ డాన్స్ ' కు తగినట్లు • నెక్సప్పీలు ' వుంటే అందుకు అభ్యంతరాలు చెబుతుంటారు. మామూలు సాంఘిక చిత్రాల్లో జాకెట్టు లేకుండా కథానాయిక స్నానం చేసినట్టు చూపినా దానికేమీ అభ్యంతరం వుండదు. పాశ్చాత్య చిత్రాల్లో అయితే ఇక చెప్పనవసరమేలేదు. అన్నీ దాదాపు మోతాదు మించే వుంటాయి. చూసే ప్రేక్షకు లందరూ ఒకరే అయినప్పుడు • సెన్సారింగ్ ' లో, ఈ బేధా లేమిటో అర్థం కాదు. తర్వా త • క్రైమ్ ' చిత్రాలని తేలికగా ఆ నే యడమే కాని, వీటి నిర్మాణంలో ఎన్ని కష్టా లున్నాయో పడుతున్న వారికే తెలుసు ! అవుట్ డోర్ షూటింగులక ని ఎక్కడెక్కడికో పోవడం. అక్కడ పగలు రాత్రులూ షూటింగులలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ప్రతి ఒక్క షాటూ నిర్దిష్టంగా రావడానికి యూనిట్ లో అందరూ శ్రమపడి కృషి చేయడం. అనుకున్న ఫలితాన్ని సాధించడం సామాన్య విషయం కాదు. కొన్ని కొన్ని సందర్భాలలో ఎంతో • రిస్కు ' తీసుకోవడం, ఒక్కోసారి ప్రమాదాలు కూడా జరగడం ఈ చిత్రాల నిర్మాణంలో సహజం. ఈ మధ్య • జేమ్స్ బాండ్ 777' చిత్రంలో విజయలలితను జీపులతో తరుముకుంటూ వెళ్ళే దృశ్యంలో నాకే ఒక భయంకరమైన ప్రమాదం జరిగింది . ఆ దృశ్యాన్ని చిత్రీకరించడానికి అదే స్పీడులో వెళ్తూ వున్న జీపులో నేను వున్నాను. • షాట్ ఎలా వస్తుందా ? ఆని ఆ దృష్టిలో నే వున్నానేమో నా కాలు ఆకస్మాత్తుగా జీపు టైరు మీద పడింది. అంతే ! గబుక్కున క్రింద పడిపోయాను. రెండో సెకనులో జీపు చక్రాలు నా మీదకు రాబోతున్నాయి. ఆ క్షణం ఎంత భయానకంగా వుంటుందో ఆలో చించండి: వెను వెంటనే ప్రక్కకు దొర్లి పోయాను . కొన్ని అడుగుల దూరంలో మా వెన కాల జీపు మరీ స్పీడుగా వచ్చేస్తోంది ! హఠాత్తుగా ఇలా జరుగుతుందని వాళ్ళు మాత్రం ఎలా వూహించగలరు ? బ్రేక్ వేయ డానికి కూడా వ్యవధి లేదు ! కాలయముడిలా దూసుకు వస్తున్న ఆ జీపును చూసి ముందూ వెనుకా ఆలోచించ కుండా మరో ప్రక్కకు దొరాను. • సర్రు ' న ముందుకు పోయి కొంత దూరం వెళ్ళాక ఆగి పోయిందా జీపు ! ఆ షాక్ ' నుంచి కోలుకుని మళ్ళీ మామూలు ప్రపంచంలోకి రావడానికి పది నిమిషాలు పట్టింది. అలాగే • సోమరిపోతు ' చిత్రానికి ఒక కారు సన్ని వేశాన్ని చిత్రీకరించవలసిందిగా ఆ చిత్ర దర్శకులు వి. రామచంద్రరావు కోరారు. దాని కోసం చెంగల్పట్టు దగ్గర ఒక ప్రాంతంలో లోయ దగర కారు ! జిగ్ జాగ్ ' గా పోవడం షాట్ తీస్తుండగా బాలన్స్ తప్పి పోవడమూ నేను కా సలో ప్రమాదాన్ని తప్పించుకోగా, కెమేరా మాన్ కి ఇంకా ఒక రిదరికీ పెదగా దెబ్బలు తగల డమూ జరిగాయి !
* శభాష్ బుల్లెమ్మ ' లో విజయలలిత, సంధ్యారాణి ఇలాంటి ప్రమాదాలను ఎన్నిటినో ఇలా మేము • క్రైమ్ ' చిత్రాల నిర్మాణంలో ఎదుర్కో వలసి వుంటుంది. మొతం మీద మేమనుకున్న ట్లుగా చిత్రం బాగా వినోదాన్ని అందించగలిగితే అప్పుడు అందరికీ కొంత తృప్తికరంగా వుంటుంది. నాకు మాత్రం వ్య క్తిగతంగా చెప్పవలసి వస్తే కుటుంబగాధా చిత్రాల పట్లే ఆసక్తి ఎక్కువ. • క్రైమ్ ' చిత్రాలను చూసి మరిచిపోయేటంత తొందరగా ఆ చిత్రాలను ప్రేక్షకులు మరువ లేరనే నా అభిప్రాయం. అయితే మొతం మీద సినిమాకు ప్రధానం వినోదం కాబట్టి మేము అన్ని రకాల చిత్రాల నిర్మాణంలోనూ పాల్గొన వలసి వుంటుంది. • కెమ్ ' చిత్రాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు; ఇవి లాభ దాయకంగా వుంటున్నాయి. అని నిర్మాతలు చెబు తున్నప్పుడు, మేము తప్పక అంగీక రించాల్సిందే. అందువల్ల వినోదమే ప్రధానం అనుకున్నప్పుడు క్రైమ్ ' చిత్రాలు కూడా అవసరమే ! కాదా ? అంటూ చెప్పారు
* శభాష్ బుల్లెమ్మ ' లో విజయలలిత, సంధ్యారాణి ఇలాంటి ప్రమాదాలను ఎన్నిటినో ఇలా మేము • క్రైమ్ ' చిత్రాల నిర్మాణంలో ఎదుర్కో వలసి వుంటుంది. మొతం మీద మేమనుకున్న ట్లుగా చిత్రం బాగా వినోదాన్ని అందించగలిగితే అప్పుడు అందరికీ కొంత తృప్తికరంగా వుంటుంది. నాకు మాత్రం వ్య క్తిగతంగా చెప్పవలసి వస్తే కుటుంబగాధా చిత్రాల పట్లే ఆసక్తి ఎక్కువ. • క్రైమ్ ' చిత్రాలను చూసి మరిచిపోయేటంత తొందరగా ఆ చిత్రాలను ప్రేక్షకులు మరువ లేరనే నా అభిప్రాయం. అయితే మొతం మీద సినిమాకు ప్రధానం వినోదం కాబట్టి మేము అన్ని రకాల చిత్రాల నిర్మాణంలోనూ పాల్గొన వలసి వుంటుంది. • కెమ్ ' చిత్రాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు; ఇవి లాభ దాయకంగా వుంటున్నాయి. అని నిర్మాతలు చెబు తున్నప్పుడు, మేము తప్పక అంగీక రించాల్సిందే. అందువల్ల వినోదమే ప్రధానం అనుకున్నప్పుడు క్రైమ్ ' చిత్రాలు కూడా అవసరమే ! కాదా ? అంటూ చెప్పారు
Social Plugin