G-N7RFQXDVV7 శ్రీకాంత్ అయ్యంగార్ లో ఈ యాంగిల్ ఏంటి?

Ticker

6/recent/ticker-posts

శ్రీకాంత్ అయ్యంగార్ లో ఈ యాంగిల్ ఏంటి?

 


నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ అనే పేరు వింటే తెలుగు సినిమా జర్నలిస్ట్ లకు మండుతుంది. ఎందుకంటే పొట్టేల్ సినిమా వేడుకలో ఆయన చేసిన వివాదస్పద వాఖ్యలే అందుకు కారణం. ఆయన గురించి వార్త చెప్పుకునే ముందు పోట్టేల్ సినిమాలో మాట్లాడిన వాఖ్యల గురించి కూడా చర్చించుకుందాం. ఆయన ఆడియో ఫంక్షన్ లో మాట్లాడుతూ.. రివ్యూ రాసేవాడు ఒక షార్ట్ ఫిల్మ్ తీసి మాట్లాడండి అంటూ అనవసర ఆవేశపూరితమైన మాటలు మాట్లాడారు. ఆయనకు అర్థం కాని విషయం ఒకటుంది. సినిమా ఎలా వుంది? అని చెప్పడానికి సినిమాను డైరెక్ట్ చేయాల్సిన స్కిల్స్ అవసరం లేదు. ఒక మంచి హోటల్ కు వెళ్లి అందులో వండిన రుచికరమైన పదార్థాలను టేస్ట్ చూసి ఎలా వుందో చెప్పడానికి అవి వండే  నైపుణ్యం వుండాల్సిన పని లేదు అనే చిన్న లాజిక్ మరిచిపోయి నోటికొచ్చినట్టు మాట్లాడి దర్శక నిర్మాతలను కాక పట్టడానికి ప్రయత్నించారు. అది వదిలెయ్యండి గతం గత:.  ఇప్పుడు శ్రీకాంత్ అయ్యాంగార్ ఇన్నాళ్లకు మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. విషయం ఏంటంటే ప్రముఖ నటి, కేరెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న జ్యోతితో కలిసి ఆయన ఏడడుగులు వేయనున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆర్టిస్టు జ్యోతి తనకు ముద్దు పెడుతున్న ఫోటోను శ్రీకాంత్ అయ్యంగార్ సోషల్ మీడియాలో  షేర్ చేసి  క్రష్ ఆఫ్ మై లైఫ్ .. మీ దేవుళ్లు మాకు పెళ్లి చేయాలనుకుంటున్నారా? అంటూ క్రేజీ క్యాప్షన్ రాశారు. ఆ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది చూసిన నెట్టిజనులు భిన్న విధాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది కంగ్రాట్స్ చెబుతుంటే మరి కొందరు మాత్రం విభిన్నంగా స్పందిస్తున్నారు. శ్రీకాంత్ అయ్యంగార్  2014లో బసంతి సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి కరోనా వైరస్, దిశ ఎన్ కౌంటర్, మర్డర్ సినిమాలతో గుర్తింపు పొందారు.