G-N7RFQXDVV7 కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ లో మోడీ ఫోటో తో ఝలక్ ఇచ్చిన ఈ సుందరి ఎవరు?

Ticker

6/recent/ticker-posts

కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ లో మోడీ ఫోటో తో ఝలక్ ఇచ్చిన ఈ సుందరి ఎవరు?

 


కేన్స్ (ఫ్రాన్స్) సినిమా ఉత్స‌వాల్లో ఈసారి భార‌త‌దేశం నుంచి ప‌లువురు క‌థానాయిక‌లు సంద‌డి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఐశ్వ‌ర్యారాయ్, నందితా దాస్, జాన్వీ క‌పూర్, అదితీరావ్ హైద‌రీ స‌హా ప‌లువురు కేన్స్ లో సంద‌డి చేసారు. ఇషాన్ ఖ‌త్త‌ర్, ఒర్రీ, ఊర్వ‌శిరౌతేలా కూడా సంద‌డి చేస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. రాజ‌స్తాన్ కి చెందిన రుచి గుజ్జ‌ర్ వేష‌ధార‌ణ కేన్స్ లో హాట్ టాపిగ్గా మారింది. ఈ భామ భారీత‌నం నిండిన రాజ‌స్థానీ డిజైన‌ర్ లెహంగాను ధ‌రించి క‌నిపించింది. అయితే త‌న మెడ‌లో ప్ర‌త్యేకంగా డిజైన్ చేసిన‌ నెక్లెస్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. దీనికి కార‌ణం ఆ నెక్లెస్‌లో భార‌త‌దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఫోటోని ఉంచి డిజైన్ చేయ‌డ‌మే. ఒక దేశ ప్ర‌ధానిని ఇలాంటి వేదిక‌కు తీసుకురావ‌డానికి కార‌ణం ఉంద‌ని రుచి గజ్జ‌ర్ వెల్ల‌డించింది.