సినిమా పరిస్థితి రోజురోజుకి దిగజారుతోంది' అని అందులో పనిచేసే సభ్యులు, పాత్రికేయులూ చాలా సంవత్సరాలుగా చెబుతూనే వస్తున్నారు. ఇది యథార్థం అని కొన్ని అంశాలతో సాక్ష్యాలనూ చూపుతున్నారు. బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందిన పన్నెండు సినిమాలు దీనికి ఉదాహరణగా కూడా చెప్పారు. అంతే కాకుండా నిశితంగా గమనిస్తే సినిమాలోని సంప్రదాయక విలువలు క్రమంగా మరుగునపడిపోతున్నాయి, నాశనమౌతున్నాయి. సినిమా పరిశ్రమ అనేది తన పంథాను పూర్తిగా మార్చుకుంటోంది. ఓటీటీల తాకిడి కూడా ఎక్కువైంది. దీనివలన సినిమా రంగంలో సాంకేతికంగా చాలా మార్పులు వస్తున్నాయి. ఇక్కడ మనం సినిమా రంగాన్ని మారుస్తున్న తొమ్మిది అంశాల గురించి పరిశీలిద్దాం.
ఐమ్యాక్స్-లేజర్ :
ఐమ్యాక్స్ సినిమాలు వచ్చేస్తున్నాయి. ఇందుకు మనం లేజర్ కిరణాలకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. లేజర్ ద్వారా రంగుల్లో గాఢత ఎక్కువగా ఉండే రంగులను ఏర్పరచవచ్చు. అంటే కాంతి, ప్రతిబింబం క్వాలిటీలో మంచి నాణ్యతను పొందే అవకాశం ఉంది. దీనివలనే ప్రేక్షకులు ఐమాక్స్ సినిమాలను ఆసక్తితో చూస్తున్నారు. ఈ పరిణామాలను గమనిస్తే భవిష్యత్ లో ఎక్కువగా ఐమ్యాక్స్ సినిమాలే రావడానికి అవకాశం ఉందనిపిస్తోంది. ఈ ప్రొజెక్టర్స్ ఉపయోగించడం వలన 3డి సినిమాల వలన కంటికి ఏర్పడే ఇబ్బందులు కనుమరుగవుతాయి. దీని వల్ల థియేటర్లకు కూడా చాలా డబ్బు ఆదా అవుతుంది. భారీ సినిమా నిర్మాణ సంస్థలు ఇటువంటి నిర్మాణ బాటలనే ఎంచుకోవచ్చు.
అద్దాలు లేని 3డి సినిమాలు:
80 దశాకాల్లో 3డి సినిమాలంటేనే ఒక అద్భుతంగా భావించేవారు. 3డి సినిమాలు చూడాలంటే ప్రత్యేకమైన కంటి అద్దాలు అవసరం. ఎందుకంటే ఇందులో రెండు కళ్లకు వేర్వేరు రంగుల్లో ప్రతిబింబాలు కనపడతాయి. ఇందుకోసం వేర్వేరు రంగులను గ్రహించే కంటి అద్దాలు కూడా అప్పట్లో అవసరమయ్యేవి. కానీ ప్రస్తుతం 'లెంటికులర్ టెక్నాలజీ సహాయంతో' 3డికి అవసరమైన ఈ అమరిక నుండి తొందరలో విముక్తి కలగనుంది. ఈ టెక్నాలజీతో స్క్రీన్ దగ్గరే కాంతి పరావర్తనం చెందేటప్పుడు వేర్వేరు ప్రతిబింబాలతో మన కంటిని చేరేవిధంగా ఉంటుంది. మరో విధానంలో 'పారాలాక్స్ బ్యారియర్' అనే విధానం ద్వారా కూడా తొందరలో మనకు అందుబాటులో రానుంది. దీని ద్వారా మన ఎల్ సిడి టీవీల ముందు 3డికి అవసరమైన రిడ్లను అమర్చడం ద్వారా 3డి ఏర్పడే రెండు ప్రతిబింబాలను మనం చూడవచ్చు. చాలా ఎక్కువగా స్పీకరు అమర్చడం ద్వారా వివిధ దిశల్లో ధ్వని రావడం కారణంగా వీక్షకునికి మంచి అనుభూతిని కలిగించవచ్చు. తోషిబా, సోనీ కంపెనీలు ఈ రెండు టెక్నాలజీలకి సంబంధించి టీవీలను తయారుచేయడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ కొంత మంది టెక్నిషియన్స్ ఇది టీవీని చూసే కోణం మీద కూడా ఆధారపడి ఉంటుంది. మరి కోణాన్ని ఎలా మారుస్తారు అని అంటున్నారు.
సినిమా స్క్రీన్ లు : ముందురోజుల్లో వెబ్ జిఎల్ అనే టెక్నాలజీ ద్వారా ప్రేక్షకులకు కథను వివరించేవారు. విన్సెంట్ అనే దర్శకుడు తను చేసిన బ్లాబ్లా అనే పారిస్ మ్యూజియంకి చెందిన ప్రాజెక్ట్స్ వెబ్ ఎల్ విధానంలో కాకుండా సాంప్రదాయక విధానంలో కథను వివరించాడు. దీనిలో అతను వినియోగించిన సౌండింగ్, కెమెరా వివిధ రకాలైన టెక్నాలజీల కారణంగా ప్రేక్షకులు సినిమాని బాగా ఆదరించారు.
డిజిటల్ కెమెరా :
ఫిల్మ్ కి డిజిటల్ కెమెరాల్లో ఏది గొప్పది అనే వాదన అప్పటి నుండి ఇప్పటివరకు జరుగుతూనే ఉంది. ఒకొక్కరి వాదన ఒక్కో రకంగా ఉంటోంది. క్రిస్ నీలన్ అనే దర్శకుడి వాదన ప్రకారం ఫిల్మ్స్ తోనే మంచి క్వాలిటీ సినిమాలను ఏర్పరచవచ్చు. భావితరాలకు ఒక మంచి క్వాలిటీ గల సినిమాలను అందించాలంటే ఫిల్మ్ తోనే అది సాధ్యం” అంటున్నాడు. కానీ స్టీవ్ సోడెర్బర్గ్ మాత్రం ఫిల్మ్ కంటే డిజిటల్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలంటాడు. సినిమా క్వాలిటీలో ఏమంత తేడా ఉండదనేది ఈయన అభిప్రాయం. దీనితో ఈయన దాదాపు 2008 బయోపిక్‌లను చిత్రీకరించి డిజిటల్ లోనే మంచి క్వాలిటీ వస్తుందని నిరూపించారీయన. ప్రస్తుతం ఉపయోగిస్తున్న రెడ్ కెమెరాలు ఇప్పుడింకా చిన్న పరిమాణాల్లో దొరుకుతున్నాయి. వీటిలో వచ్చే క్వాలిటీ ఫిల్మ్ క్వాలిటీకి ఏమాత్రం తీసిపోవడం లేదనేది చాలా మంది దర్శకుల వాదన.
మొబైల్ నుండి సినిమాను ఏక్కడైనా ప్రొజెక్ట్ చేసే ప్రొజెక్టర్ :
ఇప్పుడు మనం సినిమాని మన మొబైల్ ఫోన్ నుండి ఇంటి ఉపరితలాలు, ట్రేలు, నుదురుతో సహా ఎక్కడైనా ప్రసారం చేయోచ్చు. ప్రస్తుతం పాకెట్ సైజ్ ప్రొజెక్టర్స్ అయిన ఎమ్ ప్రో 120 సైతం వినియోగించవచ్చు. ప్రస్తుతం 3డి సినిమాల ప్రొజెక్టర్స్ సైతం మనకు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వీటి ద్వారా మనకు లభించే క్వాలిటీలో ఎక్కడా మార్పు రాదు. అలాగని పెద్ద ఖరీదు కూడా చేయవు.
ఐఫోన్, టాబ్లాయిడ్లో సినిమా వీక్షణం:
ప్రస్తుతం మన ఇంటిలోని హెచ్డ్ టీవీ క్లారిటీ కంటే ఐఫోన్, టాబ్లాయిడ్లో ఎక్కువ క్లారిటీ కనపడుతుంది. ప్రేక్షకుడు థియేటర్ కి వెళ్లినప్పుడు ఉండే ఖర్చు కంటే ఇక్కడ అయ్యే ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఎక్కువ మంది వీక్షకులు ఐఫోన్స్, టాబ్లాయిడ్ నే ఆశ్రయిస్తున్నారు. దీంతో ఎక్కడంటే అక్కడ సినిమాని మనం వీక్షించవచ్చు. ఏ సినిమాలైతే డిస్ట్రిబ్యూషన్ సమస్యను ఎదుర్కొంటాయో వాటిని నేరుగా యూట్యూబ్ లో విడుదల చేసేస్తున్నారు. మరి కొందరైతే నేరుగా ఐఫోన్లోకే సినిమాని విడుదల చేస్తున్నారు. మరి కొంత మంది దర్శకులైతే సినిమా మొత్తాన్ని ఐఫోన్లోనే చిత్రీకరిస్తున్నారు. 2011లో హూమన్ ఖలిలి మొదటిసారిగా 'ఆలివ్' అనే సినిమాని ఐఫోన్ తో చిత్రీకరించాడు. తర్వాత బ్రిటన్ కి చెందిన ఓ యువకుడు 'సిల్వర్ ఫాక్స్ అనే సినిమాని ఐఫోలో తెరకెక్కించాడు.
4డి(కొరియన్ స్టైల్) 4డి సినిమాలంటే చూసే వీక్షకుడికి ఒక మంచి అనుభూతిని కలిగించడమే. వానలో నీటి చుక్కలు పడేటప్పుడు కలిగే అనుభూతి, గాలి వీస్తున్నప్పుడు కలిగే అనుభూతి ఇలాంటివన్నీ ప్రేక్షకుడిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి. ఉదాహరణకి 'కుంగ్ ఫూ' పాండా సినిమా చూస్తే అందులో ఫైట్ సీన్స్ లో వచ్చే శబ్దాన్ని చెప్పుకోవచ్చు. అవతార్ ను కూడా కొరియాలో 4డిగా మార్చడం జరిగింది.
అప్లికేషన్లో రెండవ స్క్రీన్‌ను ఎన్నుకొనే విధానం:
'అవేంజర్' అనే సినిమా ద్వారా రెండవ అప్లికేషన్ విధానంతో సినిమాకి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. సినిమా చూసేటప్పుడు చాలా మంది సినిమా గురించి మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఇప్పుడు ప్రతి సినిమాకి ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. సినిమాతో పాటు అప్లికేషను కూడా పంపుతున్నారు. దీంతో సినిమా కబుర్లు, ఫోటోలు, సినిమా తెరపై ఏం జరుగుతుందో తెలుసుకోవడం వంటివి చేయవచ్చు. సినిమాలో సన్నివేశంతో పాటు దర్శకుడి అభిప్రాయాన్ని కూడా తెలుసుకోవచ్చు. ఇలాంటి టెక్నాలజీల కారణంగా మన తరువాత తరాలకు మంచి వినోదాన్ని అందించిన వారవుతాం.
Social Plugin