దగ్గుపాటి హీరోలతో ఓ సినిమా నిర్మించాలని అప్పట్లో ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు ఎంతో ఆశపడ్డారు. కానీ అప్పట్లో ఆయన కల ఫలించలేదు. ఆయన మరణించిన తర్వాత ఇన్నాళ్లకు ఆ కల నెరవేరేలా కనిపిస్తోంది. ఇటీవల నారప్ప సినిమా కోసం వరుస ఇంటర్వూలు ఇచ్చిన వెంకటేష్ మంచి స్క్రిప్ట్ దొరికితే నేను, రానా కలిసి చేస్తాం అంటూ చెప్పారు. మరో వైపు రానా కూడా ఇదే విషయాన్ని చాలా సార్లు చెప్పిన విషయం తెలిసిందే. వాళ్ల ఆలోచనలకు అనుగుణంగానే ఇప్పుడు మంచి స్క్రిప్ట్ దొరికింది. నెట్ ఫ్లిక్స్ సంస్థ ఇద్దరినీ కలిపి ఓ వెబ్ సీరీస్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. టెక్నాలజీ లో ఎప్పుడూ ముందుండే సురేష్ బాబు కంటెంట్ విషయంలో నెట్ ఫ్లిక్స్ తో ఒక డీల్ కుదుర్చుకొని వున్నారు. ఇప్పుడు ఈ వెబ్ సీరిస్ కూడా మొదలైతే వారి మధ్య బిజినెస్ డీల్ మరింత బలపడే సందర్భాలున్నాయి. అంతేకాకుండా తెలుగు నుంచి డైరెక్ట్ గా వెబ్ సీరిస్ లో నటిస్తున్న హీరోలు వెంకటేష్, రానా లే అవుతారు. ప్రస్తుతం సురేష్ బాబు పోకడ చూస్తుంటే తనకు థియేటర్లు వున్నా అసురన్ సినిమా రీమేక్ గా రూపొందిన నారప్ప సినిమాను డైరెక్ట్ గా అమెజాన్ లో విడుదల చేసి ఆశ్చర్యానికి గురి చేశారు. అలాగే వెంకటేష్ హీరోగా రూపొందిన ''దృశ్యం 2'' చిత్రాన్ని హాట్ స్టార్ లో రిలీజ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీనికి పలు కారణాలను సన్నిహితుల వద్ద ఆయన వ్యక్తం చేసినట్టు సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
Social Plugin