KGF 2 కోసం సినీ ప్రేక్షకులు వేచి చూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. యాష్ హీరోగా నటించిన ఈ సినిమా విడుదల డిసెంబర్ 20 అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఫరాన్ అక్తర్ తో పాటు పాటు హిందీ వెర్షన్ ను పంపిణీ చేయనున్న రితేష్ సిద్ద్వానీ మాట్లాడుతూ ప్రస్తుతం థియేటర్లు ఓపెన్ అవ్వటం లేదు. ఇలాంటి సమయంలో కేజీఎఫ్ 2 ను విడుదల చేయడం భావ్యం కాదు. అన్నీ కుదిరాక విడుదల చేస్తే లాభసాటిగా వుంటుంది. అంతే కాకుండా మేము ఉత్తరాదిన మాత్రమే పంపిణీ చేస్తున్నాం. దక్షిణాది కేంద్రంగా రూపొందిన ఈ చిత్రం సౌత్ మార్కెట్ ను పరిగణలోకి తీసుకుంటూ విడుదల విషయంలో విజయ్ కిరగండూర్, ప్రశాంత్ నీల్, యాష్ నిర్ణయం తీసుకోవలసి వుంది. అంటూ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పారు. అయితే మూలాలను విశ్లేషిస్తే కేజీఎఫ్ చాప్టర్ 2 యొక్క నిర్మాతలు ఈచిత్రాన్ని డిసెంబర్ 20న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. ఒక వేళ అదేజరిగితే మరో వైపు అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప నుండి గట్టి పోటీని ఎదుర్కోవలసి వస్తుంది. ఇదిలా వుంటే అరకొర తెరచిన థియేటర్లలో యాష్ నటించిన కన్నడ సూపర్ హిట్ మూవీ ‘లక్కీ’ చిత్రాన్ని తెలుగులోకి అనువదించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలా చేయటం వలన యాష్ కు మరింత క్రేజు సంతరించుకునే అవకాశాలున్నాయని మేకర్స్ అభిప్రాయపడుతున్నారు. కానీ తెలుగు పంపిణీదారులు మాత్రం గతంలో సూర్య సినిమా హిట్ అవ్వగానే పదుల సంఖ్యలో సూర్య నటించిన సినిమాలన్నీ వరుసగా అనువదించి సూర్యకున్న మార్కెట్ ను నాశనం చేశారు. లక్కీ పాత సినిమా కాబట్టి ఇప్పటి ప్రేక్షకులకు రుచించదు. యాష్ నటించిన పాత సినిమాలను విడుదల చేసి యాష్ కున్న క్రేజ్ ను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు అంటూ పెదవి విరుస్తున్నారు. ఏది ఏమైనా యాష్ మార్కెట్ తెలుగులో ఎలా వుంటుందో వేచి చూడాల్సిందే.
Social Plugin