దాక్కో మేక అంటూ ఇటీవల విడుదలైన సాంగ్ ప్రోమోను సాధారణంగా శుక్రవారం చిత్ర యూనిట్ విడుదల చేద్దామని భావించారట. కానీ గురువారమే లీక్ అయ్యింది. ఇది బన్నీ టీమ్ కావాలనే లీక్ చేశారా అనే కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
గతంలో మహేష్ బాబు సర్కారు వారి పాట టీజర్ కూడా ఇలాగే రిలీజ్ అయ్యింది. దాంతో హడావిడిగా అనుకున్న దానికంటే ముందే టీజర్ ను విడుదల చేయాల్సి వచ్చింది. అదేంటో గాానీ పరశురామ్ సినిమా టాక్సీ వాలా అలాగే విడుదలైంది. ఇప్పుడు మహేష్ బాబు సర్కారు వారి పాట టీజర్ లీక్ కావడమేంటి… సినిమా మీద పరశురామ్ కు కంట్రోల్ లేదా అంటూ సోషల్ మీడియాలో ప్రేక్షకులు కామెంట్ పెడుతున్నారు. క్యూరియాసిటీతో లీక్ అయితే పరవాలేదు. కానీ కావాలనే లీక్ చేస్తే అది వ్యక్తిత్వం మీదే దెబ్బ పడే అవకాశం వుంటుంది అని విశ్లేషకులు అంటున్నారు.
Social Plugin