G-N7RFQXDVV7 బాలక్రిష్ణ రెమ్యునరేషన్ రెండు వారాలకు 22 కోట్లా?

Ticker

6/recent/ticker-posts

బాలక్రిష్ణ రెమ్యునరేషన్ రెండు వారాలకు 22 కోట్లా?

 



తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్  నటిస్తున్న జైలర్ 2 సినిమాలో బాలక్రిష్ణ వున్నారంటూ ఈ మధ్య సోషల్ మీడియాలో వార్తలు హాల్ చల్ చేస్తున్నాయి. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు చక చక జరిగిపోతున్నాయి. అయితే బాలక్రిష్ణ జైలర్ సినిమాలో నటిస్తున్నారు అనే వార్తలో నిజమెంత అనేది పరిశీలిస్తే,జైలర్ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఒక పాత్రలో నటించారు. ఆ పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. అదే ఫార్ములాను అప్లై చేస్తూ జైలర్ 2 సినిమాలో బాలక్రిష్ణను సంప్రదించారనే విషయం తెలిసింది. అది నిజమే అంటూ మేకర్స్ కూడా ఇటీవల క్లారిఫికేషన్ ఇచ్చారు. అయితే బాలక్రిష్ణ ఏ.పి పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో ఆయన పాత్ర దాదాపు పది నుంచి 15 నిమిషాల దాకా వుంటుందనీ, అందుకు గాను బాలక్రిష్ణ  22 కోట్లు డిమాండ్ చేశారని తెలిసింది. ఇందుకు గాను ఆయన రెండు వారాల పాటు షూటింగ్ లో పాల్గొంటారనీ, షూటింగ్ పార్ట్ మన తెలుగు రాష్ట్రాలలోనే జరుగుతుందని తెలిసింది. మరి బాలక్రిష్ణకు, రజనీకాంత్ కు మధ్య కాంబో సీన్లు వుంటాయా అనేది మాత్రం తెలియాల్సి వుంది. బాలక్రిష్ణ డిమాండ్ చేసిన 22 కోట్లను ఇవ్వడానికి సన్ పిక్షర్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనీ, బాలక్రిష్ణ అభిమానులు విపరీతంగా చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం బాలక్రిష్ణ అఖండ 2 షూటింగ్ లో పాల్గొంటున్నారు. దసరా కు అఖండను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.