G-N7RFQXDVV7 హిట్ 3 స్క్రిప్ట్ అనాలసిస్

Ticker

6/recent/ticker-posts

హిట్ 3 స్క్రిప్ట్ అనాలసిస్

 



సాధారణంగా కథ అంటే ఒక మొదలు, మధ్య, ముగింపు ల మధ్య సాగే ప్రయాణమే కథ. రచయిత కథను ఎలా ప్రారంభించి ఆ పాత్రల తీరుతెన్నులు ఎలా తీర్చి దిద్దారు అనే దానిపైన మంచి కథ ఆధారపడి వుంటుంది. మనం హిట్ 3 సినిమా కథ ను అనాలసిస్ చేసినప్పుడు

డేంజరస్ పోలీస్ ఆఫీసర్ గా వున్న అర్జున్ సర్కార్  తను ఇన్వెస్టిగేషన్ లో మనుషులను క్రూరంగా చంపుతూ, డార్క్ వెబ్ లో ఒక టీమ్ చేస్తున్న అక్రుత్యాలను ఆపడానికి చేసే ప్రయత్నమే ఈ కథ.

హింస అంటే అత్యంత ఆసక్తి చూపే ఒక వర్గం మనుషులను ఒక టీమ్ గా ఏర్పాటు చేసి వాళ్లందరినీ డార్క్ వెబ్ లో ఒక సమూహంగా ఏర్పాటు చేసి, వాళ్లందరినీ ఒక పీరియడ్ లో కలిసేలా ఏర్పాటు చేసుకుంటారు. ఈ టీమ్ లో చేరాలంటే వాళ్లు ఏర్పాటు చేసుకున్న కండీషన్స్ తో రెండు హత్యలు చేసి జాయిన్ కావలసి వుంటుంది. అర్జున్ సర్కార్ దేశ శ్రేయస్సు కోసం ఆ టీమ్ ను నాశనం చేయడానికి నడుం కట్టి తను కూడా వాళ్లు పెట్టుకున్న కండీషన్స్ తో రెండు హత్యలు చేసి వాళ్ల టీమ్ లో చేరతాడు. చివరికి ఆ గ్యాంగ్ నంతా నాశనం చేసి ఎంతో మంది అమాయకుల ప్రాణాలు రక్షిస్తాడు.

దాదాపు కథలన్నీ త్రీ యాక్ట్ స్ట్రక్షర్ ప్రకారమే నడుస్తాయి.

Act 1::  గురించి మాట్లాడుకుంటే పాత్రలు, ప్రపంచం, ప్రధాన సమస్యను పరిచయం చేయాల్సి వుంటుంది.  హిట్ 3 లో   నాని ఒక స్క్రిక్ట్  పోలీస్ ఆఫీసర్ అనే విషయాన్ని పరిచయం చేస్తారు. అంతే కాకుండా శ్రీనగర్ లో తలకిందులుగా వేలాడ దీసి చేసిన హత్య తో సమస్యను పరిచయం చేస్తారు. ఆ కేసులను ఎలా సాల్వ్ చేస్తాడు అనే దగ్గర పాత్ర ప్రయాణాన్ని పరిచయం చేస్తారు.

Act 2 :  పాత్రను పరీక్షించడం.

నాని రెండు మర్డర్లు చేస్తున్న ప్రయాణంలో  రెండో మర్డర్ చేస్తున్నప్పుడు నాని సబార్డినేట్ చూసి నాని పైన అటాక్ చేస్తుంది. అక్కడ మొదలైన ఇన్వెస్టిగేషన్ ఆసక్తికరంగా ముందుకు సాగుతుంది. ఆ మర్డర్లు ఎందుకు చేస్తున్నారు అనే ట్విస్ట్ లతో హీరో పాత్రను కన్వూజన్ కు గురి చేస్తూ  పాత్రను పరీక్షిస్తూ వుంటుంది. ఇలా అన్నిటినీ ఎదుర్కొంటూ తన గమ్యాన్ని చేరుకునే ప్రయత్నంలో రెండు హత్యలు చేసి ఆ డార్క్ వెబ్ టీమ్ లో చేరి తన పై అధికారుల సహాయంతో డెన్ లోకి వెళ్లి అక్కడ సంక్షోబాలను ఎదుర్కొంటాడు.


Act 3:  చివరి పోరాటంలో పాత్ర గొప్ప పరీక్షను ఎదుర్కోవాలి.

హిట్ 3 లో నాని తను మాటిచిన్న ప్రకారం చిన్న పాపను రక్షించి, ఆ పాపతో పాటు చాలా మంది అమాయకులను రక్షించి ఆ డార్క్ వెబ్ టీమ్ నంతా నాశనం చేసే ప్రయత్నంలో నాని డార్క్ వెబ్ టీమ్ కు దొరికిపోతాడు. ఇక చంపేస్తారు అనుకున్న సమయంలో అడివి శేష్ పాత్ర ఎంటరై నానికి హెల్ప్ చేసి క్లైమాక్స్ పీక్ కు వెళ్లేలా సహాయపడింది. చివర్లో బావోద్వేగాన్ని పండించడానికి చిన్న పాపను విలన్లు చంపబోతే నాని ఆ పాపను రక్షించి క్లైమాక్స్ కు తెరలేపుతాడు. ఆ పాపను రక్షించడంలో భావోద్వేగాలు బాగా పండాయి.


హిట్ 3 సినిమా ప్రొఫెషనల్ స్క్రీన్ రైటింగ్ టెంప్లెట్ ను సరిగ్గా ఫాలో అవుతూ స్క్రిప్ట్ తయారు చేశారు. ప్రారంభంలో మొదట పది శాతం, పాత్రలను సమస్యను పరిచయం చేశారు. తర్వాత పది నుంచి పదిహేను శాతం లో నాని శ్రీనగర్ లో జరిగిన మర్డర్ ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ విశాఖపట్టణం చేరుకుంటాడు. 25 శాతం లో మొదటి టర్నింగ్ పాయింట్ జరుగుతుంది. రెండు మర్డర్లు చేసి నాని ఆ టీమ్ లో చేరుతాడు. మిడ్ పాయింట్ 50 శాతంలో తీసుకుంటే నాని ఆ టీమ్ లోకి జాయిన్ అయినప్పుడు పోలీసులను డైవర్ట్ చేసి నానిని సపరేట్ గా డెన్ లోకి తీసుకెళ్లడం దగ్గర నుంచి హీరో కు ప్రమాదం పెరుగుతుంది. ఆ తర్వాత టర్నింగ్ పాయింట్లు, చివరిగా తొంభై శాతంలో క్లైమాక్స్ చిత్రీకరణ వుంటుంది.


కాబట్టి హిట్ 3 స్క్రిప్ట్  రాసిన రచయిత వంద శాతం స్క్రీన్ రైటింగ్ టెంప్లెట్ ను ఫాలో అయ్యారు. ఇంకాస్త లోతుగా తీసుకుంటే ఈ సినిమా హీరోస్ జర్నీ టెక్నిక్ లో సాగుతుంది.


హీరోస్ జర్నీ టెక్నిక్ లో  ముఖ్యంగా 9 దశలు వుంటాయి.


సాధారణ ప్రపంచం: కథ ప్రారంభంలో హీరో లేదా హీరోయిన్ సాధారణ జీవితం చూపించబడుతుంది.

2 పిలుపు: ఏదో ఒక సంఘటన వాళ్ల జీవితం మలుపు తిప్పుతుంది.

3. పిలుపు తిరస్కారం:  మొదట హీరో ఆ పిలుపును భయంతో లేదా సందేహంతో తిరస్కరిస్తాడు.

4. మెంటర్ తో కలిసే వేళ: మెంటర్ లేదా గైడ్ హీరోకు సలహా ఇస్తారు. కావలసిన పరికరాలు ధైర్యం ఇస్తాడు.


5. కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టడం

6. పరీక్షలు, మిత్రులు, శత్రువులు: కొత్త ప్రపంచంలో కొత్త మిత్రులు పరిచయం కావడం, శత్రువులతో మసలుకోవడం లాంటి సంఘటనలు

7, పెద్ద పరీక్షకు ముందు హీరో ప్రమాదకరమైన ప్రాంతానికి చేరుకుంటాడు.

8: ఆ తర్వాత హీరో కఠిన పరీక్షను ఎదుర్కోవడం.

9. హీరో అనుకున్నది సాధించడం.


ఇవన్నీ హిట్ 3లో సంవ్రుద్ధిగా వున్నాయి కాబట్టే హిట్ 3 లో అంత వైలెన్స్ వున్నా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.