G-N7RFQXDVV7 వెబ్ నార్ లో డైరెక్లర్ల ఇంట్రస్టింగ్ డిస్కషన్

Ticker

6/recent/ticker-posts

వెబ్ నార్ లో డైరెక్లర్ల ఇంట్రస్టింగ్ డిస్కషన్

 


ప్రతి పరిశ్రమ కు అనాది నుంచి సాంకేతిక పురోగతి అంతరాయాన్ని కలిగిస్తునే వస్తోంది. ఇలా మార్పు చేసుకున్న ప్రతిసారి పరిశ్రమల ముఖచిత్రం మారిపోతూ వుంటుంది. ప్రస్తుతం సినిమా రంగం కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. అనాది నుంచి సినిమాకు ఒక ప్రత్యేక స్థానముంది. టెలివిజన్, కేబుల్ టీ.వి, విసిడి, డివిడి, బ్లూరే, లాంటి వినోదాన్ని పంచే సాధనాలెన్ని వచ్చినా సినిమా స్థానం మాత్రం అదే కొనసాగుతోంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ పాం మాత్రం సినిమా ముఖ చిత్రాన్ని మారుస్తుందని సీరియస్ ఫిల్మ్ మేకర్స్ ఘంటాపదంగా చెబుతున్నారు.సాధారణంగా ఒక మంచి కథను దర్శకుడు ప్రేక్షకులకు చెప్పే తీరునే సినిమా అంటారు.   ఈ కథను ఒక్కొక్క దర్శకుడు ఒక్కో స్టైల్ లో చెబుతుంటారు. కమర్షియల్ దర్శకులైతే ఆరు పాటలు, నాలుగు ఫైట్స్, ఒక ఇంట్రడక్షన్ ఫైట్, హీరో ఇంట్రడక్షన్, హీరోయిన్ ఇంట్రడక్షన్, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ ఇలాంటి సమయాల్లో సినిమాలో ఎలాంటి ట్విస్ట్ లు వుండాలి. థియేటర్ లో బంచ్ ఆఫ్ పీపుల్ చూస్తున్నప్పుడు హీరోకు ఎలాంటి ఇంట్రడక్షన్ సీన్ వుంటే ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తుంది అనే విషయాలు ఆలోచించడానికి కథ చర్ఛల్లో చాలా సమయాన్ని తీసుకుంటూ వుంటారు. ఇంట్రవెల్ బ్యాంగ్ పై ఎక్కువ ద్రుష్టి కేటాయిస్తారు. అలాగే ఫైట్స్ చిత్రీకరణ లో ,పాటల చిత్రీకరణలో విపరీతమైన కేర్ తీసుకోవడం చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫాంలో విడుదలయ్యే సినిమాలకు అవన్నీ అవసరం లేదు అంటున్నారు సీరియస్ దర్శకులు.ఇంతకూ ఈ సీరియస్ దర్శకులంటే ఎవరు అనే అనుమానం మీకు రావచ్చు. చిత్ర పరిశ్రమలో రియలిస్టిక్ గా వుండే సినిమాలను తీసేవాళ్లు సీరియస్ దర్శకులైతే.. కమర్షియల్ ఎలిమెంట్స్ తో సినిమాలు తీసే వాళ్లను కమర్షియల్ దర్శకులని ముద్ర వేశారు ప్రేక్షకులు. ఈ విషయాన్ని పక్కన పెడితే... చిన్న తరహా సినిమాలన్నీ ఓటీటీలోనే విడుదలయ్యే అవకాశం భవిష్యత్తులో కనిపిస్తోంది.. ఎందుకంటే చిన్నసినిమాల్లో పెద్దపెద్ద సెట్ లు వుండవు. బ్లాస్ట్ లు వుండవు.  అట్మాస్ సౌండ్ సిస్టమ్ లాంటి హంగులుండవు . కేవలం కథనే అస్త్రంగా చేసుకొని ఎమోషన్ ను పండిస్తూ తీసే సినిమాలు కాబట్టి కుటుంబ సమేతంగా చూసేవిధంగా నిర్మిస్తే ఓటీటీలో ఆదరణ లభిస్తుంది అంటున్నారు విశ్లేషకులు.. ఇటీవల సీరియస్ ఫిల్మ్ మేకర్స్ మధ్య వెబ్ నార్ ద్వారా  జరిగిన ఆసక్తికరమైన చర్చ ను సేకరించడం జరిగింది. సేకరించిన విషయంలో వారి పేర్లు చెప్పడం భావ్యం కాదు కాబట్టి వారి వారి పేర్లు చెప్పటం లేదు. పేరున్న ఓ బాలీవుడ్ దర్శకుడు మాట్లాడుతూ ‘ ఒక సీరియస్ సినిమా నిర్మాణమే వేరు. కథను మొదట్నుంచి ఎలా డ్రైవ్ చెయ్యాలి అనే దర్శకుడు ఆలోచిస్తాడు తప్ప… హీరో ఇంట్రడక్షన్ సీన్ ఎలా ఇవ్వాలి? హీరో కెరీర్ ఎలా బిల్డ్ చేయాలి అని ఆలోచించడు. దర్శకుడికి కావలసింది కేవలం సినిమా కథ ను ఎలా డ్రైవ్ చెయ్యాలి ఎమోషన్స్ ఎలా పండించాలి అనే విషయాలు మాత్రమే. ఇక ఓటీటీ ఫ్లాట్ ఫాంలో ఇంట్రవెల్ వుండదు కాబట్టి ఇంట్రవెల్ బ్యాంగే అవసరం వుండదు అన్నారు.ఒక ప్రముఖ జాతీయ దర్శకుడు మాట్లాడుతూ... ‘ ప్రస్తుతం సినిమా తీరు, గేరూ రెండూ మారాయి. గతంలో ప్రేక్షకుడికి  కథను ఖచ్చితంగా చెబితే చాలు అని వుండేది. కానీ సినిమా గేరు మారడంతో అది కాస్త…. ముందుకెళ్లింది. కథలో చిన్న పాయింట్ అయినా సరే రెండు గంటల పాటు ప్రేక్షకుడికి ఒక ఎమోషన్ కలిగించాలి. రెండు గంటల పాటు ప్రేక్షకుడు  సినిమాకే ఎంగేజ్ అయి వుండాలి. అనేది ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫాం మీద వున్న ట్రెండ్. ఈ ఎమోషణ్ క్యారీ చేస్తున్నప్పుడు మధ్యలో సంబంధం లేకుండా పాటలు వచ్చినా, అనవసరమైన ఫైట్స్ వచ్చినా ఆడియన్ డైవర్ట్ అయిపోతాడు. కాబట్టి నా ద్రుష్టిలో సినిమా మారింది అని అన్నారు. ప్రస్తుతం అవార్డులకు నోచుకుంటున్న సినిమాలన్నీ ఎమోషన్ పైన ద్రుష్టి పెట్టి  నిర్మించిన  సినిమాలే అవ్వడం విశేషం. మనం ఓటీటీ ఫ్లాట్ ఫాంలో గమనిస్తే అన్నీ రియలిస్టిక్ కథలే ప్రాచుర్యం పొందాయి తప్ప కమర్షియల్ సినిమాలకు పెద్ద ఆదరణ లేదు.  పెద్ద హీరోల కమర్షియల్ చిత్రాలు ఒక ఏరియాకే పరిమితమవుతున్నాయి. అదే సహజత్వంతో కూడిన కథలను మాత్రం ప్రపంచ వ్యాప్తంగా చూస్తున్నారు. మంచి కథకు హీరో అవసరం వుండదు. ఇప్పుడు వెబ్ సీరిస్ లు, ఒరిజినల్స్ లో ఆడియన్స్ హీరో ల మీద ఆధారపడటం లేదు. ఎవరు నటించినా వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల బాగా ఫేమస్ అయిన ‘ఫామిలీ మ్యాన్’, ‘గాడ్’ లాంటి వెబ్ సీరిస్ లు  హీరోల మీద ఆధారపడకుండా హిట్ అయ్యాయి. అలాగే నెట్ ఫ్లిక్స్, అమెజాన్ లాంటి ఓటీటీ ప్లాట్ ఫాంలను తీసుకుంటే అందులో ఎక్కువ సీరియస్ సినిమాలకే ప్రాధాన్యత వుంటుంది. అందులోనూ,  సీరియస్ సినిమా చెయ్యడానికి పెద్ద ఖర్చు అవ్వదు కానీ... ప్రపంచ వ్యాప్తంగా మంచి లాభాలొచ్చే అవకాశం వుంటుంది. సీరియస్ సినిమా  ఎమోషన్స్ మీద రన్ అవుతాయి కాబట్టి వాటిని ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టించవు. కమర్షియల్ సినిమాలు రెండు సార్లు చూడగానే బోర్ కొడుతుంటాయి. ఒక కమర్సియల్ సినిమాకు, సీరియస్ సినిమాకు వున్న బలమైన వ్యత్యాసం అదే అని మరో దర్శకుడు అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాతకు థియేటర్ కలెక్షన్స్ తో పాటు ఓటీటీ లో విడుదల చేయడం కూడా ఇంపార్టెంటే. కాబట్టి. నిర్మాత రెండు బిజినెస్ లను బ్యాలన్స్ చేస్తూ పెద్ద సినిమాలను నిర్మించేందుకు ప్లాన్ చేసుకుంటారు. అందుకే సినిమా మారింది ప్రస్తుతం సీరియస్ సినిమా దర్శకులకు డిమాండ్  పెరుగుతోంది అంటున్నారు. కమర్షియల్ దర్శకులు నెంబర్ ఆఫ్ షాట్స్ తీస్తూ సహజత్వాన్ని పోగొడుతున్నారు. అంతేకాకుండా ఫైట్స్ లో పాటల్లో ఎగ్జాగరేట్ చెయ్యాడానికి రోప్స్ సహాయాన్ని వుపయోగించడం, ప్రస్తుతం డాన్స్ల్లో కూడా గ్రాఫిక్స్ ఉపయోగిస్తూ ఒక రకంగా ప్రేక్షకుడిని ఛీట్ చేస్తున్నారు. సాంకేతికత పెరిగింది కాబట్టి దీన్ని ప్రేక్షకుడు మోసం లాగా భావిస్తున్నాడు. అందుకే క్రమ క్రమంగా కమర్షియల్ సినిమాల మీద ఆసక్తి తగ్గుతోంది. ఓటీటీ లోని సినిమాలపైనే ప్రేక్షకుడు తన ఆనందాన్ని చూసుకుంటున్నాడు అని మరో దర్శకుడు చెప్పారు. ఇక రీమేక్ ల విషయానికి వస్తే  ప్రస్తుతం సినిమాలకు అంతరాలు తగ్గాయి. ఏ సినిమాను ఎక్కడైనా చూడచ్చు. మన సినిమాలను ప్రపంచ వ్యాప్తంగా ఓటీటీ ప్లాట్ ఫాం మీద వీక్షించచ్చు. కాబట్టి రీమేకులకు అస్సలు వేల్ల్యు వుండదు. కాపీ కొట్టినా ఇట్టే పట్టుకొని జరిమానా వసూలు చేస్తారు. సినిమా అనేది క్రియేటివ్ జాబ్ కాబట్టి జాగ్రత్తగా వ్వవహరించాల్సి వుంటుంది .ఇకపై తమిళ, మలయాళ రీమేక్ ల గురించి మాట్లాడుకుంటే…. ప్రస్తుతతం తమిళ,మలయాళ, కన్నడ, తెలుగు సినిమాల మధ్య అంతరాలు తగ్గిపోయాయి. ఒక భాషలో వచ్చే వారికి కథ ముందే తెలిసిపోయి వుంటుంది కాబట్టి కథ వారికి పెద్ద ఆసక్తి కనిపించదు. అని అనుకుంటున్నారు. ఈ మధ్య కొత్తగా ఎటీటీ  (ఎనీటైం థియేటర్) అంటూ కొత్త యాప్ లను తయారు చేస్తున్నారు. ఇటీవల రాంగోపాల్ వర్మ ఎటీటీ అనే ఆలోచన ద్వారా సక్సెస్ అయ్యారని అంటున్నారు. దర్శక దిగ్గజం రాంగోపాల్ వర్మ ఆలోచన కరెక్టే. కానీ... అదే ఆలోచన ఇంకొకరికి సరిపోతాదని మేము భావించము. రాంగోపాల్ వర్మ సినిమా మీద ప్రేక్షకులకు ఆసక్తి వుంటుంది. కానీ ఇతర యాప్స్ ప్రమోట్ కావాలంటే క్రేజున్న సినిమా అయినా అందులో రిలీజ్ అవ్వాలి. లేదంటే ఆ యాప్ లో వున్న సినిమాలన్నీఒక రేంజ్ సినిమాలు అనే నమ్మకం ప్రేక్షకులకు కలగాలి. ఏదో సినిమా తీసి పెట్టి ఎంతో కొంత వస్తుంది అనుకుంటే అది పొరపాటే. సినిమాను యూటూబ్ లో పెట్టుకుంటే ఎంత మొత్తం వస్తుందో పేరులేని యాప్స్ లో వచ్చే ఆదాయం కూడా అంతే వుండచ్చు అనే అభిప్రాయాన్ని ఓ నిర్మాత వ్యక్తం చేశారు.