సీనియర్ నటి జమున అంటే తెలియని తెలుగు వాళ్లుండరు అంటే అతిశయోక్తి కాదు. ఇప్పటి తరం కూడా ఆమె సినిమాలు యూటూబ్ లో అనేకం చూసి వుంటారు. ఆమె నటించే సమయంలో ఎలాంటి ఆపదలు ఎదుర్కొంది అనే విషయాలను ఆ మధ్య ఆమె ఒక ఇంటర్వూలో చెప్పిన విషయాలను యదాథతంగా మీకు అందిస్తున్నాం. సినిమా నటన అంటే చాలా సులభమనీ, సినిమా తార లందరూ ఎప్పుడూ విలాసవంతమైన జీవితాన్నేగడుపుతూ వుంటారనీ చాలామంది అనుకుంటారు. తెర మీద అందంగా కనిపించే రకరకాల దృశ్యాలు కొన్ని చూస్తూ, తారల జీవితం ఎప్పుడూ పూలబాట మీదే నడుస్తుందనుకుంటే అది నిజానికి పొరపాటే అని చెప్పాలి. ప్రేక్షకులకు వెండి తెర మీద పువ్వులే కనిపిస్తాయి. కాని పువ్వుల్లోని ముళ్ళు తగిలి, ముందుగా మేము పడే బాధ మాత్రం కనిపించదు. అని సీనియర్ నటి జమున చెప్పారు. సినిమా షూటింగ్ లో కొన్ని కొన్ని సన్నివేశాలలో ప్రాణాలకు కలిగే ప్రమాదాన్ని కూడా లెక్క చేయకుండా మేము నటిస్తూ ఆయా దృశ్యాలకు ప్రాణం పోయవలసి వుంటుంది. చిత్రంలో మీరు ఆ దృశ్యం చూసినప్పుడు అలాంటి పరిస్థితులను వూహించలేరు కూడా. ఆదే దృశ్యాన్ని మేము చూసినప్పుడు, సన్నివేశం తృప్తికరంగా పుందనుకున్నప్పుడు షూటింగ్ లో పడ్డ ఇబ్బందులూ, కష్టాలను మరచి పోయి తేలిగ్గా నవ్వుకుంటాము. అంటూ ఆమె అప్పట్లో ఒక వ్యాసంలో చెప్పారు.ఇంకో సంగతేమిటంటే, షూటింగ్ జరుగు తుండగా మాకేమన్నా ప్రమాదం వాటిల్లినా, గాయాలు తగిలినా అందుకు జీవితభీమా తాలూకు పరిహారం కూడా ఏమీ లభించదు ఈ విషయాలు ఆలోచిస్తూవున్నా, నా అనుభ వాలు తలచుకున్నా ఇప్పటికీ నా ఒళ్ళు జల దరిస్తూనే వుంటుంది. అంటూ జమున చెప్పసాగారు. ఒక రోజు జెమినీ స్టూడియోలో శ్రీ కాంత్ అండ్ శ్రీకాంత్ ఎంటర్ ప్రైజెస్ వారి చిత్రం 'సతీ అనసూయ ' షూటింగ్ జరుగుతున్న సందర్భం. ఆనసూయగా నేనే నటిస్తున్నానన్న సంగతి చెప్పనక్కర లేదనుకుంటాను. 'మేకప్' అంతా అయ్యాక 'సెట్టు మీదికి అడుగు పెట్టాను.ఆ రోజు అనసూయను ఒక చెట్టుకు కట్టేసి, చుట్టూ పుల్లలను పేర్చి, నిప్పంటించే దృశ్యాన్ని చిత్రీకరించాలని చెప్పారు. నాకా చెట్టు చుట్టూ దగ్గర దగ్గరగా పేర్చిన పుల్లలను చూసేటప్పటికే మనసులో కాస్త జంకు ప్రారంభమయింది. అప్పటికీ ఏ మాత్రం భయపడకుండా పుల్లలను ఇంకా కాస్త దూరంగా జరిపించమని చెబుతూ చెట్టు దగ్గరకు వెళ్ళి నిలబడ్డాను. పుల్లల మీద కిరోసిన్ఆయిల్ వేశారు. చెట్టు వెనక్కి చేతులు కట్టేసినట్లుగా వుంచి, నిలబడ్డాను. చిత్రీకరణకు అన్ని ఏర్పాట్లు అయ్యాక దర్శకుని ఆజ్ఞాను సారం పుల్లలకు నిప్పు అంటించారు. అంతే. మంటలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. చుట్టూ నల్లగా పొగ కమ్ముకుంది. వూహించడానికి కూడా వీలులేనంతగా అలా జరిగేటప్పటికి, నా కంతా అయోమయమైపోయింది. ఆ క్షణంలో నేనేమవుతున్నానో నాకే తెలియడం లేదు. విపరీతంగా పొగ చుట్టూ కమ్ముకుపోతూ వుంది. నా చీరె అంటుకుంటుందా అనిపించింది. వూపిరి అందటం లేదు. "కబ్.... కట్....” అని భయం భయంగా ఏవేవో కేకలు వేస్తున్నాను.అందరూ కంగారు పడిపోయారు. ఎక్కడి నుంచో నీళ్ళు తెచ్చి ఆదరాబాదరాగా మంటలు ఆర్పేయడానికి ప్రయత్నించ సాగారు. భయంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతూ, మంట ల్లోంచి తప్పించుకోవడానికి అటూ ఇటూ చూస్తు న్నానేగాని, ఏమీ తోచడం లేదు. ఇంతలో ఒక ప్రక్క కాస్త ఖాళీగా 'దారి వున్నట్లు కనిపించింది.ముందూ, వెనకా ఆలోచించ లేదు.మొండి ధైర్యంతో కళ్ళుమూసుకుని నేను నిలబడ్డ స్థలం లోంచి, మంటల బయటికి ఒక్క దూకు దూకాను. ఆ క్షణంలో బాలెన్స్ ' తప్పి, పడిపోతున్నానేమో ననిపిం చింది. అంతలో ఎవరోనన్ను అమాంతంగా పట్టు కుని మంటల్లో పడిపోకుండా కాపాడారు.ఒక్క నిమిషం వరకూ నేను 'నేను' లా లేను.కాస్త తేరుకున్నాక,చూస్తే, అప్పటికే చాలావరకు మంటలు ఆదుపులోకి వచ్చాయి.నన్ను రక్షించింది ఆ చిత్రం యొక్క స్టెంట్ డైరెక్టర్ అని తెలుసుకున్నాక, ఆయనకు నా కృతజ్ఞతలు తెలుపుకున్నాను.ఆది * అనసూయ ' ను బాధ లు పెట్టే దృశ్యం. కానీ ఆ రోజు అది నిజంగా నా బాధే అయింది.నిప్పుతో ఎంత ప్రమాదం తప్పిందో, అంటూ తను ఎదుర్కొన సంఘటనను జమున గారు గుర్తు చేసుకున్నారు.
Social Plugin