G-N7RFQXDVV7 సీనియర్ నటి జమున కు గుర్రం నుంచి తప్పిన ప్రమాదం

Ticker

6/recent/ticker-posts

సీనియర్ నటి జమున కు గుర్రం నుంచి తప్పిన ప్రమాదం

 




సీనియర్ నటి జమున గారు షూటింగ్ లో పాల్గొన్నప్పుడు మరో రెండు ప్రమాధాల నుంచి బయటపడ్డారట.  అవి వినే కొద్ది చాలా ఇంట్రస్టింగ్ గా వున్నాయి.మీ కోసం ఆమె చెప్పిన ఆ రెండు సంఘటనలు గుర్తుచేసుకుందాం... అప్పుడు...."పూల రంగడు' చిత్రం తాలూకు కొన్ని సన్ని వేశాల షూటింగ్ అవుట్ డోర్ ఏర్పాటు చేశారు. నదీ ప్రవాహం. ప్రవాహం మధ్య లోంచి, నేను పాట పాడుకుంటూ వెళ్తుంటే, ఆ దృశ్యాన్ని చిత్రీకరించాలి. షూటింగ్ కు అన్ని ఏర్పాట్లు అయ్యాయి.పాటను అభినయిస్తూ నెమ్మదిగా నదీ ప్రవా హంలోంచి నడవసాగాను. ఓ పదడుగులు వేసే టప్పటికి, కాలికేదో రాయి తగిలినట్టయింది. మరుక్షణంలో జర్రున కాలు జారింది. ప్రవా హంలో వున్న రాళ్ళలోంచి జోరుగా 'స్కేటింగ్ 'లా, అలా జారిపోతున్నాను కేకలు వేస్తూ. అందరూ ప్రవాహం ప్రక్కగా పరుగెత్తసాగారు.ఆ పరిస్థితి ఎంత భయానకమైనదో మీరే వూహించండి ఏ క్షణంలో ఒక ప్రక్కకు ఒరిగి పడి పోయినా ప్రవాహంలో పడి కొట్టుకుని పోయే దాన్ని. అయితే అదృష్టవశాత్తూ అలా జరగ లేదు. ఈలోగా ఒక అసిస్టెంటు డైరక్టరు అప్పటికే అక్కడికి ఈదుకుంటూ వచ్చి, జారిపోతూ వస్తున్న నన్ను గభాలున పట్టుకుని, ప్రవాహం లోకి పడిపోకుండా కాపాడాడు. ఆ రోజు నేను పడ్డ భయం ఇంతా అంతా అని వర్ణించడానికి వీలుకానిది — అందుకే నేను. సినిమా జీవితం పూల బాట కాదని ముందే చెప్పాను.ఈ ప్రమాదాల నుండి కొద్దిలో తప్పించుకొని బయటపడడం ఒక్కోసారి తలచుకుంటుంటే నాకే ఆశ్చర్యంగా వుంటుంది. అన్నట్లు మరో 'ఏక్సిడెంట్ ' గుర్తుకు వస్తూంది.ఈ సంఘటన 'సిపాయి కూతురు' తీస్తూం డగా జరిగింది. దృశ్యం ఏమిటంటే నేను గుర్రం మీంచి వస్తూండగా, వెనకాల ప్రజలంతా ఉత్సాహంతో, “సిపాయి కూతురుకు జై' అంటూ వస్తూంటారు.కెమెరా, తదితర సాధనాలూ అన్నీ సిద్ధం చేశారు. డైరక్టరుగారు 'స్టార్ట్' అన్నారంతే చిత్రీకరణ ప్రారంభమవుతుందన్నమాట. నేను గుర్రం మీద కూర్చున్నాను. అందరూ డైరెక్టర్ గారి ఆజ్ఞకోసం ఎదురు చూస్తున్నారు. ఆయన 'స్టార్' అన్నారు. అంతా 'సిపాయి కూతురుకు జై' అని ఒక్కసారిగా అరిచారు. పాపం గుర్రా నికి సంతోషమో, భయమో తెలియదు కాని ఒక్కసారి జోరుగా ముందుకాళ్ళు పైకెత్తి, భయంకరంగా సకిలించింది. గుర్రం ఇలా చేస్తుం దని, ముందుగా నా కెలా తెలుస్తుంది? ఏదో యాదాలాపంగా గుర్రం మీద కూర్చున్న నాకు పట్టు కాస్తా తప్పిపోయింది. దభాలున కింద పడ్డాను. దెబ్బలు బాగా తగలకపోయినా, చాలా సేపటి వరకూ భయం పోలేదంటే నమ్మండి ఆ తర్వాత నాకు గుర్రం మీద కోప మొచ్చింది. ఎలాగైనా సరే.. గుర్రపుస్వారీ నేర్చు కోవాలనే స్థిరనిర్ణయానికి వచ్చాను. మరో రెండు రోజులకే ఒక తెల్లగుర్రం కొనడమూ, దానికి 'బహదూర్' అని పేరు పెట్టడమూ కూడా జరిగి పోయాయి. బహదూర్ కు  ఒక 'ట్రెయినర్ కూడా వుండేవాడు,అప్పట్లో మేము ఆడయార్ లో వుండేవాళ్ళం, ఉదయాన్నే నేను గుర్రమెక్కి స్వారీ చేస్తూ అటూ ఇటూ తిరుగుతూ వుంటే, అందరూ వింతగా చూసేవారు. ఒకరోజు గుర్రానికి ట్రెయినర్ మేత వేస్తూం డగా మూతికి బకెట్ తగిలి పెద్ద దెబ్బ తగిలింది. దాంతో ఒక వారం రోజులవరకూ గుర్రం బయ టికి రాకుండా వుండిపోవలసి వచ్చింది. ఆ వారం అయ్యాక, మామూలుగా ట్రెయినర్ గుర్రానికి మేత వేద్దామని, షెడ్ తలుపు తీశాడు. అతన్ని చూడగానే, తలుపు తీసీతియ్యగానే, 'బహదూర్ 'బయటికి పరుగు లంకించుకుంది. మా ఇంటి గేటు దూకి, రోడ్లమ్మట పడి ఎటు పోయిందో మెరుపులా మాయమయింది.ఇక 'బహదూర్'ను 'వెదికి పట్టుకోవడానికి అందరమూ రకరకాలుగా ప్రయత్నించసాగాము. ఆ తర్వాత తెలిసిందేమిటంటే, బహదూర్ తిన్నగా నేను తరుచూ వెళుతుండే మా బంధు వుల ఇంటికి వెళ్ళి, సరాసరి వాళ్ళ డ్రాయింగ్ రూమ్లో అటూ ఇటూ కాసేపు తిరిగిందట. అక్కడివాళ్ళందరూ గాబరాపడి 'ఇదేమిటా' అని అనుకునేంతలో మళ్ళా వాళ్ళ ఇంట్లోంచి బయటపడి, రోడ్లమ్మట పరిగె గెత్తిందట. వాళ్ళు గుర్రం నన్నెక్కడన్నా పడేసి, నాకేదైనా ఆపద కలిగించిందేమోనని ఆందోళన పడుతూ, మా ఇంటికి పోన్ చేసి ఈ సంగతి చెబుతూ 'నేను బావున్నానా ?' అని అడిగారట. మొత్తానికి ఎలాగైతేనేం బహదూర్ ఎక్క డెక్కడో తిరిగి సాయంత్రానికల్లా మొహం చిన్నబుచ్చుకుని, బుద్ధిగా మా ఇంటికి వచ్చేసింది. ఈ సంగతి విన్నాక నాకు నవ్వాగలేదు. ఒకవేళ నేను స్వారి చేస్తుండగానే, ఇప్పుడొచ్చినట్లుగా కోపంతో పరుగులు తీసివుంటే, నా కేదైనా ప్రమాదం వాటిల్లే దేకదా ? అబ్బా... ఈ ప్రమాదాల మాట జ్ఞాపకం చేసుకుంటూ వుంటేనే భయంగా వుంటుంది. అయితే ఎప్పటికప్పుడు వాటి గురించి మరచిపోతూ ప్రేక్షకుల తృప్తిమేరకు చిత్రాన్ని అందివ్వడంలో నిర్మాత దర్శకులకు సహకరించడానికి మే మెప్పుడూ ప్రయత్నిస్తూ వుంటాము. ఆ ప్రయ త్నాల పూలబాటలోని ముళ్ళే ఇలాంటి ప్రమాదాలు. ప్రమాదాలూ, ప్రమోదాలూ జీవితంలో ఎప్పుడూ వుంటాయి. కాని భయం కలిగించే ప్రమాదాలు మరిచిపోవాలన్నా మరపు రావు. అయినా ఇది చెప్పిన తర్వాతయినా మరచిపో తానో లేదో.... ప్రయత్నించి చూడాలి అంటూ చెప్పారు. ఈ వ్యాసం చదువుతున్నంత సేపు చాలా ఇంట్రస్టింగ్ గా అనిపించింది. అందుకే ఈ విషయాలను మీకు అందిస్తున్నాం. వచ్చే వారం మరికొన్ని విషయాలతో మీ ముందుకొస్తాం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి