G-N7RFQXDVV7 అల్లు రామలింగయ్య చూసిన మొదటి షూటింగ్ ఇదే నట

Ticker

6/recent/ticker-posts

అల్లు రామలింగయ్య చూసిన మొదటి షూటింగ్ ఇదే నట


నాటకములలో పేరు ప్రఖ్యాతులతో పాటు విశేషానుభవాన్ని గడించిన అల్లు రామలింగయ్య సినిమాల్లో కూడా నటించడానికి ముందుకొచ్చారు. , పుట్టిల్లు "అనే సినిమా ద్వారా చిత్ర రంగ ప్రవేశం చేశారు. అది ఎలా జరిగింది అనేది ఆయన ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన మాటలే మీ కందిస్తున్నాం. అదే... అల్లు రామలింగయ్య గారు  సినిమా షూటింగ్ చూడ్డం. అంతకు ముందు ఎన్నడూ మద్రాసు రాలేదట : షూటింగ్ లూ చూడలేదట. అసలు సినిమా అంటే, నటుల ముందు కెమెరా పెట్టి తీస్తా రని మాత్రం తెలుసుగాని, ఎలా తీస్తారూ? ఏమిటీ అన్నది కూడా  తెలీదు. సరే, అని అల్లు రామలింగయ్య  వేషం వేసుకుని సెట్లోకి వెళ్ళారట. వెళ్ళగానే భయం వేసింది. ఏదో భయంకరమైన గుహలోకి వెళ్ళినట్టుగా అనిపించిందట. సెట్లో అడుగు పెట్టగానే, అంతటా లైట్లు, ఒకపక్క కెమెరా, ఆ యంత్రాలూ, మనుషులూ అవన్నీ చూసి. హడిలిపోయాడట. " టేరో రామలింగయ్యా- టేరో-భయపడకు, నువ్వు నటుడిని కాబో తున్నావు ధైర్యే సాహసే లక్ష్మి" అని తనకు తనే భుజం తట్టుకుని, ధైర్యం చెప్పు కున్నారట.  దర్శకుడు డాక్టర్ రాజారావుగారు. పరిచయమైన వారే కాబట్టి, ఆయన దగ్గర భయపడలేదు. ఆవాళ సెట్లో జమున గారూ.. మిక్కిలినేని గారూ వున్నారు. నాకు సంభాషణ ఇచ్చారు. చెప్పేశాను. ఏమీ భయం కలగ లేదు. ఇంతేనా? ఈజీ" అనుకున్నాను. ఆ రోజు షూటింగ్ అపోయింది. చిత్రమేమిటంటే, షూటింగ్ కు ముందు కొందరికి భయం వేస్తుంది; జ్వరం వస్తుంది. నాకు మాత్రం ఐపోయిన తర్వాత వచ్చింది. నా ఒళ్ళంతా వేడెక్కి పోయింది. రాత్రంతా నిద్ర పట్టలేదు. 'జ్వరంతో బాధపడ్డాను. కాని జ్వరం కాదు. ఏమిటిది? ఎందుకిలా  ఇబంది ? అనుకున్నాను. ఆఁ - ఆదీ- సెట్లో వున్న ఆ లైట్ల వేడివల్ల. దాని వల్లనే మనం ఇలా దెబ్బతిన్నాం. ఇలా ఐతే, ఈ చిత్రాల్లో నటించడం ఎలా ? వీటికీ మనకూ ఎలా పొత్తు కుదుర్తుంది? కుదరదా? .... ఈ షూటింగులు మానేసి, నాటకాలు ఆడుకో వలసిందేనా? అన్న ఆలోచనలతో నానా బాధా పడ్డాను. తెల్లవారింది. వంట్లోని వేడి తగ్గిపోయింది. 'ఓహో మొదటి రోజు షూటింగ్ నాడు అలా వుంటుంది కాబోలు” అని సర్ది చెప్పుకున్నాను. కాని, మొదటి రోజు షూటింగ్ చూసినప్పుడు, కలిగిన భయమే ఆ రాత్రి అలా వచ్చిందేమోనని.... నా కిప్పటికీ అనుమానంగానే వుంటుంది. అదీ నేను చూసిన మొదటి షూటింగ్ లో నేనే నటించాను అంటూ ఒక పత్రికకు చెప్పిన ఇంటర్వూలో చెప్పారు.