బాహుబలి నిర్మాతలు రాంగ్ స్టెప్ వేస్తున్నారా?
కింది చిత్రం మహేశింతే ప్రతీకారం లోని చిత్రం
తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చిత్రం `బాహుబలి`. తెలుగు సినిమా ప్రేక్షకులు గర్వపడే ఈ గొప్ప చిత్రాన్ని అందించిన నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని. అంత భారీ బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని అందించిన ఈ నిర్మాతలు వెంటనే మరో సినిమానో నిర్మించకుండా ఆచితూచి అడుగు వేస్తారని విశ్లేషకులు భావించారు. వారి ఆలోచనలకు తగ్గట్టే మలయాళ హీరో ఫాహద్ ఫాజిల్ హీరోగా నటించిన హిట్ చిత్రం `మహేశింతే ప్రతీకారమ్` చిత్రాన్ని కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వంలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా మలయాళంలో విడుదలై ఇప్పటికి మూడేళ్లు కావొస్తొంది. కథాంశానికి వస్తే... హీరో ఒక స్టిల్ ఫోటో గ్రాఫర్... ఒక సందర్భంలో తను చేయని తప్పుకు హీరోయిన్ అన్న చావగొడతాడు. అప్పుడు హీరో చెప్పులు తెగిపోతాయి. అప్పటి నుంచి హీరోయిన్ అన్నను తను కొట్టే వరకు చెప్పులు వేసుకోను అని ప్రతిజ్న చేస్తాడు అదే ఈ చిత్ర కథ. మరి ఇలా రియలిస్టిక్ గా తీసిన సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా? అంతే కాకుండా ఇప్పుడు సినిమా చాలా చిన్నదైంది. ఏ భాషలో తీసినా సినిమా హిట్ అయితే యూత్ ముందే చూసేస్తున్నారు. మరి యూత్ అంతా సినిమా చూసేసి వుంటారు కాబట్టి ఈ సినిమా అంత పెద్ద హిట్ అవుతుందా? అని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో సత్యదేవ్ కంచెరన హీరోగా రూపొందిన బ్లఫ్ మాస్టర్ తమిళ చిత్రం రీమేక్... చందరంగ విట్టై సినిమా చూసిన ప్రేక్షకులకు బ్లఫ్ మాస్టర్ ఏ మాత్రం రుచించలేదు. అలాగే ఈ చిత్రం కూడా అవుతుందా? మలయాళ ప్రేక్షకులను మెప్పించిన ఈ చిత్రం అంతే స్లోగా వుంటే తెలుగు వాళ్లకు రుచిస్తుందా? అనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఏమో బాహు బలి నిర్మాతలకు కదా... పబ్లిసిటీలో ఏదో ఒక జిమ్మిక్కు చేయకపోతారా? అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
ఆర్కా మీడియా వర్క్స్, మహాయాణ మోషన్ పిక్చర్స్ బ్యానర్స్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, విజయ ప్రవీణ పరుచూరి నిర్మాతలుగా `కేరాఫ్ కంచపాలెం` ఫేమ్ వెంకటేశ్ మహ దర్శకత్వంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి తెలుగులో `ఉమామహేశ్వర ఉగ్రరూపాశ్య` అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
వెంకటేశ్ మహ అరకు వ్యాలీలో 36 రోజుల్లోనే సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలుజరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఏప్రిల్ 17, 2020 విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీతలు బిజ్‌బల్ సంగీతాన్ని, అప్పు ప్రభాకర్ సినిమాటోగ్రఫీ అందించారు.
సత్యదేవ్ కంచరన, నరేష్, సుహాస్, జబర్‌దస్త్ రాంప్రసాద్, కరుణాకరణ్, టి.ఎన్.ఆర్, రవీంద్ర విజయ్, కె.రాఘవన్ తదితరులు నటిస్తున్నారు.
Social Plugin