దక్షిణాది సినిమాల్లో ట్రెండ్ మారింది. ఒకప్పుడు టాప్ హీరోలకు వారి వారి ఇమేజ్ లను బట్టి స్నేహపూర్వక పోటీ వుండేది. అప్పట్లో ఒక వైపు స్వర్గీయ ఎన్టీఆర్, సూపర్ స్టార్ క్రిష్ణ అభిమానులు ఒకరికి ఒకరు పోటీ పడేవారు. ఎన్టీఆర్, క్రిష్ణ కలిసి సినిమాలో నటిస్తున్నారంటూ వార్తలు వస్తే అది సెన్సేషన్ అయ్యేది. ఆ తర్వాతి జనరేషన్ లో మెగాస్టార్ కు, బాలక్రిష్ణకు మధ్య బలమైన పోటీ వుండేది. ఇద్దరు హీరోల అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేది. అలాంటి వాతావరణం నుంచి టాలీవుడ్ నెమ్మదిగా బయటపడింది. ఇప్పుడు ఇండియా బాక్సాఫీసును కొల్లగొట్టడమే పనిగా టాలీవుడ్ ప్లాన్ చేస్తోంది. అసలు విషయం ఏంటంటే ఒక స్టార్ హీరో సినిమాలో మరో హీరో గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వడం సర్వ సాధారణమైపోయింది. ప్రస్తుతం మెగాస్టార్ హీరోగా అనీల్ రావిపూడి ఒక సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కథ అనుకున్నప్పుడు వెంకటేష్ పాత్ర లేదు. కానీ అనీల్ రావిపూడి గతంలో వెంకటేష్ తో ఎఫ్ 2, సీక్వెన్స్, సంక్రాంతికి వస్తున్నం చేసిన చనువుతో వెంకటేష్ ను ఒప్పించి మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటింపజేయడానికి నడుం కట్టారు. గతంలో కూడా వాల్తేరు వీరయ్య సినిమాలో మెగాస్టార్ తో కలిసి రవితేజ నటించిన విషయం తెలిసిందే. అలాగే తమిళనాట రజనీకాంత్ హీరోగా, లోకేష్ కనగరాజ్ రూపొందుతున్న కూలీ చిత్రంలో ఉపేంద్ర, నాగార్జున కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే రజనీకాంత్ హీరోగా నటిస్తున్న జైలర్ చిత్రంలో కన్నడ హీరో శివన్న, మలయాళం స్టార్ మోహన్ లాల్, బాలక్రిష్ణ, పహాద్ ఫాజిల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. సలార్ లో యథావిదిగా ప్రుథ్వీరాజ్ సుకుమారన్ కంటిన్యూ అవుతారు. అలాగే బాలీవుడ్ చిత్రం వార్ 2 లో హ్రుతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ హీరో కాకపోయినా బాలీవుడ్ సినిమాకు ఓకే చెప్పాల్సి వచ్చింది.
Social Plugin