గేమ్ ఛైంజర్ తర్వాత శంకర్ రెండేళ్లు విరామం ఇవ్వాల్సి వచ్చింది. అంతేకాకుండా ఇటీవల కార్తీక్ సుబ్బరాజు చేసిన వాఖ్యలు కూడా శంకర్ ఇమేజ్ ను బాగా డ్యామేజ్ చేశాయి. గేమ్ ఛైంజర్ విషయంో ఒక వేళ తప్పు జరిగినా, కార్తీక్ సుబ్బరాజు శంకర్ పై అలాంటి కామెంట్లు చేయకూడదని తమిళ తంబిలు చెప్పుకుంటున్నారు. కార్తీక్ సుబ్బరాజు ఇచ్చిన కథను శంకర్ మార్చేశారు సరే. మరి ఆ కథ హిట్ అయ్యి వుంటే ఇది నేను ఇచ్చిన కథ కాదు అని బయటకు చెప్పేవారా?. ఇదంతా అవకాశ వాదం. ప్రతి మనిషికీ కొన్ని మంచి రోజులు, మరికొన్ని గడ్డు రోజులు వస్తాయి. అంత మాత్రం చేత వాళ్ల మీద రాళ్లు వెయ్యడం సరికాదు అని తమిళ చిత్ర పరిశ్రమ శంకర్ మీద జాలి చూపిస్తున్నారు. ప్రస్తుతం శంకర్ చేతిలో భారతీయుడు 3 మాత్రమే వుంది. శంకర్ ఆశలు కూడా దీనిపైనే వుంచారు. ఒక వేళ గేమ్ ఛైంజర్ హిట్ అయ్యి వుంటే టాలీవుడ్ లో పరిస్థితి వేరేలా వుండేది. ఆయన చేతిలో చాలా సినిమాలు వుండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. పోనీ భారతీయుడు 3 గురించి ఆలోచిద్దాం అనుకుంటే అది కూడా బజ్ లేదు. భారతీయుడు 2 సినిమా దారుణమైన ఫలితాన్ని చూశాక, దాని ప్రభావం భారతీయుడు 3పై కూడా పడింది. దాని మీద పుకార్లు ఎలా వచ్చాయంటే ఆ సినిమాను థియేటర్లలో విడుదల చేయరు. డైరెక్టు ఓటీటీలోనే విడుదల చేస్తారు అనేంతగా వార్తలు వచ్చాయి. దీన్ని మేకర్స్ సీరియస్ గా తీసుకొని లేదు.. లేదు మేము థియేటర్లలోనే విడుదల చేస్తాం అని స్టేట్ మెంట్ ఇవ్వడంతో పరిస్థితి కూల్ అయ్యింది. ఈ సినిమాను ఈ ఏడాదే విడుదల చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా తర్వాత శంకర్ పరిస్థితి ఏంటి అంటే రెండేళ్ల పాటు విశ్రాంతి తీసుకుంటారని శంకర్ సన్నిహితులు చెబుతున్నారు. శంకర్ బౌన్స్ బ్యాక్ కావాలంటే మంచి కథ కావాలి. కాబట్టి కాస్త విరామం తీసుకుంటారు అని చెప్పడంతో, అంటే శంకర్ విశ్రాంతి తీసుకుంటున్నది మంచి కథ కోసమా అని తమిళ వెబ్ సైట్స్ రాస్తున్నాయి.
Social Plugin