G-N7RFQXDVV7 గరుడ వేగ డైరెక్టర్ అన్నపూర్ణ స్టూడియోలో పాగా..

Ticker

6/recent/ticker-posts

గరుడ వేగ డైరెక్టర్ అన్నపూర్ణ స్టూడియోలో పాగా..

 


గరుడ వేగ డైరెక్టర్ అన్నపూర్ణ స్టూడియోలో పాగా..



మన్మధుడు - 2 చిత్రం తర్వాత నాగార్జున తన ద్రుష్టిని యాక్షన్ సినిమాలు, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలపై మరల్చారు. నాగార్జున హీరోగా ఇటీవల వైల్డ్ డాగ్ అనే చిత్రం పోస్టర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. మరో చిత్రానికి గరుడ వేగ దర్శకుడు ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహిస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం బాహుబలి వెబ్ సీరిస్ తో బిజీగా వున్న ప్రవీణ్ సత్తార్. తన తదుపరి చిత్రాన్ని నాగార్జున హీరోగా రూపొందిస్తున్నారని తెలిసింది. గతంలో ఓ సినిమాను రామ్ హీరోగా తెరకెక్కించడానికి ప్రయత్నించగా అది మధ్యలోనే ఆగిపోయింది. ప్రస్తుతం రూపొందిస్తున్నది అదే కథ నా? లేక... కొత్త కథ నా అని పరిశ్రమలో ఆసక్తి నెలకొంది.