G-N7RFQXDVV7 HIT 3, RETRO సినిమాల బిజినెస్ అనాలసిస్

Ticker

6/recent/ticker-posts

HIT 3, RETRO సినిమాల బిజినెస్ అనాలసిస్



 మే మొదటి వారంలో నాని హీరోగా నటించిన హిట్ 3 భారీ బజ్ తో విడుదల కానుంది. దానికి పోటీగా సూర్య హీరోగా నటించిన రెటిరో కూడా ఇదే వారంలో విడుదలకానుంది. సాధారణంగా అయితే నాని హీరోగా నటించిన హిట్ 3 కి భారీ బజ్ వుంది కాబట్టి, సూర్య రెటిరో విడుదలను వాయిదా వేసుకునే వారు. . కానీ తమిళ నాట కూడా విడుదల చేయాల్సి వుంది. అందులోనూ అక్కడ సూర్యకు వున్న క్రేజ్ ను ద్రుష్టిలో పెట్టుకొని ఇదే వారంలో విడుదల చేస్తున్నారు. ఇలాంటి కారణాల వలన విడుదల తేదీని వెనక్కి వేసుకోవడానికి రెండు సినిమాలకు వీలు కాలేదు. అందుకే రెండు భారీ సినిమాలు ఒకే వారంలో విడుదలకానున్నాయి. అయితే సినిమా విడుదలకు ముందే ఈ రెండింటి బిజినెస్ ఎలా వుంటుంది అని విశ్లేషిస్తే, ఈ రెండు సినిమాల్లో హిట్ 3 కమర్షియల్ గా మంచి బజ్ తో ముందుంది అని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన స్క్రీన్స్ ఇప్పటికే ఫుల్ అయినట్టు తెలుస్తోంది. ఇక పోతే రెటిరో  సినిమా కలెక్షన్లు ఆశించినంతగా కనిపించట్లేదు.  రెటిరో టీజర్ కూడా ప్రేక్షకులను నిరాశ పరిచింది. ఈ  ట్రైలర్ ఎంత మాత్రం ప్రేక్షకులకు ఆసక్తి కలిగించలేదు. ఈ సినిమాను  సితారా ఎంటర్ టైన్ మెంట్ నాగవంశీ విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. 

ఇక నాని హీరోగా నటించిన  హిట్ 3 సినిమా బిజినెస్ విషయానికి వస్తే 25 కోట్ల నుంచి 30 కోట్ల దాకా బిజినెస్ జరిగినట్టు తెలిసింది. దీని ప్రకారం పర్సెంటేజ్ తీసుకుంటే  సీడెడ్ హక్కులు దాదాపు  5 నుంచి 5.50 వరకు జరిగినట్టు సమాచారం. ఇక నైజాం ఏరియాకు దాదాపు తొమ్మిది కోట్లు దాకా జరిగినట్టు తెలిసింది. ఇక ఆంధ్ర ఏరియాకు పది కోట్ల దాకా బిజినెస్ జరిగినట్టు సమాచారం. అయితే సినిమా కొన్న రెండు తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమా పట్ల చాలా సంతోషంగా వున్నారు. ఎందుకంటే ఈ సినిమా యావరేజ్ టాక్ వచ్చినా భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం వుంది. మొదటి రోజు రెండున్నర కోట్లు ఓపెనింగ్స్ వచ్చే అవకాశం వుందని ఓ డిస్ట్రిబ్యూటర్ కాన్పిడెంట్ గా చెప్పారు. అంత కాన్ఫిడెంట్ గా చెప్పడానికి కారణమేంటి? అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ, ఈ సినిమా కోసం నాని, శ్రీనిధి శెట్టి చేసిన ప్రమోషన్స్ సినిమా ఓపెనింగ్స్ కు కారణం అయ్యాయి. అంతే కాదు మే 1న పబ్లిక్ హాలిడే వుంది. సినిమాకున్న బజ్ కారణంగా అన్ని షోలు, అన్ని థియేటర్స్ ఫుల్స్ అయ్యే ఛాన్స్ వుంది.  కాబట్టి మంచి ఓపెనింగ్స్ రావడానికి ఆస్కారం వుంది. దీంతో తెలుగు రాష్ట్రాలలో బయ్యర్స్ కు మొదటి రోజే దాదాపు  42 నుంచి 50 పర్సెంట్ వరకు  రికవరీ అయ్యే ఛాన్స్ వుంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే పెద్ద లాభాలు వచ్చే అవకాశం వుంది. యావరేజ్ టాక్ వచ్చినా సినిమా ప్రాఫిట్ లోనే వుంటుంది. ఎందుకంటే వేసవి సెలవలు వుండటం. హీరో నానిని కుటుంబ ప్రేక్షకులు ఎక్కువ గా ఇష్టపడటం. గత రెండు వారాల నుంచి మంచి సినిమా లేకపోవడం. వచ్చే రెండు వారాలు కూడా చెప్పుకో దగ్గ సినిమా లేకపోవడంతో హిట్ 3 టాక్ తో సంబంధం లేకుండా  మంచి లాభాలు సాధించే దిశగా వెళుతుందని నిపుణులైన డిస్ట్రిబ్యూటర్లు విశ్లేషిస్తున్నారు. సీడెడ్ లో హిట్ 3 ని ఐదు కోట్లకు కొన్నారు. ప్రస్తుతం సినిమా మీదున్న బజ్ ను ద్రుష్టిలో పెట్టుకొని మా అంచనా ప్రకారం మొదటి రోజు రెండున్నర కోటి షేర్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. రాయలసీమ లాంటి ప్రాంతాల్లో మొదటి రోజు కొంచెం షేర్లు కనిపిస్తాయి. ఎందుకంటే సింగిల్ థియేటర్స్  రెంట్ బేసిస్ లో వేస్తారు కాబట్టి డిస్ట్రిబ్యూటర్ కు షేర్ ఎక్కువ కనిపించే అవకాశం వుంది. ఇక ఇతర సెంటర్లలో మల్టీప్లెక్స్ లు కాబట్టి వాటిల్లో పర్సెంటేజ్ పైన వేస్తారు కాబట్టి అయా ప్రాంతాల్లో ఇక్కడ వున్నంత షేర్ కనిపించకపోవచ్చు అంటూ సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ ఒకాయన తెలిపారు.

ఇక పోతే నాని హీరోగా గతంలో ఇలాంటి ప్రమోషన్ తో వచ్చిన దసరా సినిమా కూడా 25 కోట్ల బిజినెస్ చేసింది. అయితే కేవలం నైజాం నుంచే ఆ చిత్రం 20 కోట్ల దాకా వసూలు చేసింది.  సీడెడ్, ఆంధ్రాలో కొంతమందికి నామినల్ లాస్ అయ్యింది.

ఇక సూర్య హీరోగా నటించిన రెటిరో సినిమా విషయానికి వస్తే రెండు తెలుగు రాష్ట్రాల బిజినెస్ 9 నుంచి పది కోట్ల రేంజ్ లో జరిగిందని సమాచారం. సూర్య నటించినా ఈ సినిమాకు పెద్దగా బజ్ లేదు. అంతే కాకుండా రెటిరో ట్రైలర్ ప్రేక్షకులను నిరాశపరిచింది. మేకర్స్ సినిమా బాగుంటుంది అని చెబుతున్నా , అటు ప్రేక్షకుల్లో, ఇటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లలో ఎందుకో ఈ సినిమాకు పెద్దగా బజ్ లేదు. అయితే కొంతమంది విశ్లేషకులు మాత్రం దీనిపై ఒక కోణంలో మాట్లాడుతున్నారు. సూర్య తమిళ హీరో కాబట్టి ఇక్కడ పెద్దగా అడ్వాన్స్ బుకింగ్ జరగలేదు. తెలుగు ప్రేక్షకులు నాని వైపే మొగ్గు చూపారు. అయితే తమిళనాడులో రెటిరో కు మంచి కలెక్షన్లు వున్నాయి. నాని హిట్ 3 కి అక్కడ పెద్దగా బుకింగ్స్ లేవు అంటే ఇక్క భాషాభిమానం మెయిన్ రోల్ ప్లే చేస్తోంది. అలాగని మనం  సూర్య నటించిన రెటిరోను తక్కువగా అంచనా వెయ్యలేం అంటూ చెబుతున్నారు. తెలుగు ప్రేక్షకులు మాత్రం ట్రైలర్ లో కనిపించిన అలాంటి తమిళ కామెడీ తెలుగు ప్రేక్షకులను ఎంత మాత్రం ఆకట్టుకోలేదు అంటూ చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ వారం సాగుతున్న హిట్ 3, రెటిరో పోటీల్లో హిట్ 3 కమర్షియల్ గా తెలుగు రాష్ట్రాల్లో మంచి విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.