G-N7RFQXDVV7 రాజేష్ టచ్ రివర్ దర్శకత్వ పాఠాలు (పార్ట్ 6) కథకు ఆత్మ ముఖ్యం

Ticker

6/recent/ticker-posts

రాజేష్ టచ్ రివర్ దర్శకత్వ పాఠాలు (పార్ట్ 6) కథకు ఆత్మ ముఖ్యం

రాజేష్ టచ్ రివర్ దర్శకత్వ పాఠాలు (పార్ట్ 6)


 



కథకు ఆత్మ ముఖ్యం


ఇంతకు ముందు చెప్పిన దర్శకత్వ పాఠాల్లో స్క్రీన్ పై కనపడే అంశాలు గురించి చర్చించుకున్నాం. అయితే స్క్రీన్ ప్లేతో ముడిపడిన అనేక అంశాలు నిగూఢంగా వుంటాయి. ఈ అంశాలు దర్శకునికీ, సినిమాకి సంబంధించిన క్లారిటీని ఏర్పరుస్తాయి. నాటకీయత గురించి మరింత అవగాహన కల్పిస్తాయి.


ముఖ్యాంశాలు


ఇక్కడ రెండు ముఖ్య విషయాలను చర్చించుకుందాం. ఉదాహరణకు మట్టితో బొమ్మలు చేసే వ్యక్తి మట్టితో బొమ్మలు చేస్తున్నాడనుకుందాం. అతను మట్టితో నిలబడి వున్న బొమ్మను చేసినప్పుడు దాన్ని కూర్చొనేటట్టు చేయాలంటే వీలుపడదు. ఒక వేళ కష్టపడి కూర్చునేటట్టు చేశాడనుకోండి దాన్ని చూసి ఎవ్వరూ ఇష్టపడరు. ఎందుకంటే అతను చేసింది నిలబడే బొమ్మను కానీ కూర్చున్న బొమ్మను కాదు. అడ్జెస్ట్ చేసిన బొమ్మ తాలుకు గుర్తులు ఇట్టే తెలిసిపోతాయి. దీన్నే సినిమాకు అన్వయించుకోవచ్చు. సినిమాకు కథ ముఖ్యం. నటుడి నటన ముఖ్యాంశానికి అంటే కథకు సపోర్ట్ చేసేలా వుండాలి.  ఈ తేడా మన ప్రక్రియలో ఒక శాస్త్రీయ అంశాన్ని తెలియజేస్తుంది. దీన్నే డ్రైమటర్జీ అంటారు. ఒక శిల్పికి డ్రైమెటర్జీ అనేది ఇక్కడ చాలా ముఖ్యాంశం.


మనం బలవంతంగా కథలో చొప్పించే అంశాలు కథతో సహా అందులోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తాయి. హరల్డ్ కర్ల్మన్ అనే దర్శకుడు ఈ విషయం గురించి మాట్లాడుతూ ' ఒక దర్శకుడు సినిమా నిర్మాణంలో ముఖ్యాంశాన్ని (ఆత్మను) గుర్తించాలి. లేకుంటే వ్యర్థం. ఒకవేళ దర్శకుడికి అది తెలియకపోతే సినిమాలో సీన్ తర్వాత వచ్చే సీన్ ఏదో నాటకీయంగా ఉంటుందే తప్ప అందులో జీవం ఉండదన్నారు. |కథలోని ఆత్మను పట్టుకున్న తర్వాత మనం తెలుసుకోబోయే రెండవ అంశం పాత్రల్లోని ముఖ్యాంశాలు. కథను బట్టి, అందులోని ప్రాముఖ్యతను బట్టి పాత్రల స్వభావం మారుతుంటుంది. ఒక సినిమాలో నాయకుడి ప్రధాన పని భూమిని కాపాడం కావచ్చు. ఇంకో కథలో ప్రేయసి ప్రేమని జయించడం. మరో చోట జీవిత సత్యాన్ని అన్వేషించడం, సత్యం, మాట్లాడుతూ జీవితాన్ని గడపడం. ఇలా పాత్రల ముఖ్యత్వం అనేది కథ ముఖ్యాంశ పరిధిలోనే ఉండాలి. క్యారెక్టర్స్ ముఖ్యత్వం స్క్రీన్ ప్లేకి తగిన విధంగా ఉండాలి. ఒకవేళ ఆ రెండింటికీ తగిన సంబంధం లేకుంటే పాత్ర ఫెర్ఫార్మెన్స్ కు విలువ ఉండదని కర్ల్ మన్ తెలియజేశాడు. కర్ల్ మన్ ఇగ్యూన్ ఓనిల్ అనే దర్శకుడు 'లాంగ్ డేస్ జర్నీ ఇస్తూ నైట్స్' చిత్రానికి , దర్శకత్వం వహించినప్పుడు కింద పెర్కొన్న ముఖ్యాంశాలను కథలో తెలియజేశాడు. ఈ చిత్రంలో ప్రతి ఒక్కరు ఏదో పొగొట్టుకుని దానికి కోసం వెతుకుతుంటారు. వారిలో టైరైస్అనే పాత్ర తన తండ్రి స్థానాన్ని నిలబెట్టడానికి, మ్యారి అనే పాత్ర ఇంటి వ్యవహారాలను చక్కబెట్టడానికి, ఎడ్మండ్ అనే వ్యక్తి సత్యాన్ని అర్థం చేసుకోడానికి, జామీ అనే క్యారక్టర్ చేసిన తప్పు నుండి బయట పడడానికి చూస్తున్నట్టుంటుంది. ఎలియా కజన్ అనే అమెరికా సినీ దర్శకుడు, థియేటర్ ప్రముఖుడు కూడా కర్ల్ మన్ చెప్పిన ఈ అంశాలను గురించే ఏ స్త్రీ కార్ నేమ్ డిజైర్'లో చెప్పాడు. ఈ పుస్తకాన్ని టోబీ కొలె ఎడిట్ చేశారు. దర్శకులకు ఈ పుస్తకం చాలా ఉపయోగపడుతుంది.. కజన్ ఆలోచనలు, దర్శకత్వం గురించి డిటెక్టివ్ వర్క్ గురించి సంపూర్ణంగా తెలియజేస్తుంది. ఫెడ్రికో ఫెలిని అనే దర్శకుడు సినీ నిర్మాణం కష్టమైందని చెప్పాడు. సినిమా నిర్మాణం అంటే ఆయన దృష్టిలో అంతరిక్ష్యంలోకి వెళ్లే రాకెట్ను చేయడంతో సమానం.


ఫెలిని ఉద్దేశం ప్రకారం ప్రతి సినిమాకి కథ, క్యారెక్టర్ మాత్రమే ప్రధానంగా ఉండక్కర్లేదు. కొన్నిసార్లు సినిమాలోని మానవ సంబంధాలే ప్రధాన భూమికను పోషిస్తాయి.


అందుకు ఉదాహరణగా 1963లో విడుదలైన తన చిత్రం 'మాస్టర్‌ పీస్ పార్ట్ 3ని తెలియజేశాడు. ఇంకో రకంగా చెప్పాలంటే డ్రమటర్టీ ప్రకారం ఆయన అక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ అంశాలను క్రింద పరిశీలిస్తే


సినిమా ప్రధానాంశం : మంచి హోదా కలిగిన జీవితం కోసం అన్వేషించడం.


గైడోఅనే పాత్ర అంశం: జీవితంలో అబద్ధమనేది లేకుండా జీవించడం.


గైడో భార్య అంశం : నిజమైన పెళ్లి చేసుకోవడం


క్లారా అనే పాత్ర ఉద్దేశం: అందరి ప్రేమకు పాత్రురాలు కావడం (గైడోతో పాటు ఆమె భర్త ప్రేమను పొందడం)


రచయిత: కళను గురించి అన్వేషించడం, -


కార్డినల్: చర్చి ద్వారా భగవంతుని ప్రార్ధనతో మంచి మార్గంలో అందరి మధ్య సఖ్యతను అన్వేషించడం.


వుమన్ ఇన్ వైట్: నిజానిజాల్ని వెలికితీయడడం, మంచిని గురించి చెప్పడం. కీలక పాత్రల ఆంతర్యాన్ని గుదిగుచ్చినట్టు చెప్పడం వల్ల సినిమా అనే గొడుగు కింద కథాంశం అందంగా కనిపిస్తోంది. కథాపరమైన ఏకత్వం సినిమాకు మరింత శోభను కలగజేస్తుంది. కొన్నిసార్లు రాసిన స్క్రిప్టును మరలా చదువుకోవడం వల్ల కూడా ఈ వెన్నెముకలాంటి అంశం బోధపడుతుంది. కొన్నిసార్లు స్క్రిప్ట్ను రీరైట్ చేయాలనిపిస్తుంది. మన పాత్రలు ఒకదానితో ఒకటి సమన్వయం కానట్టు అనిపిస్తే ఆ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించదని అర్థం చేసుకోవాలి. కొన్ని సార్లు ఇవేమీ లేకపోయినా సినిమా ప్రేక్షకుల్ని మెప్పించింది అంటే అందులో గాఢమైన మానవ సంబంధాలేవో అల్లుకున్నాయని అర్థం చేసుకోవాలి. (మానవ సంబంధాలకు ఎవరికి నచ్చిన పేరు వాళ్లు పెట్టుకుంటుంటారు. ప్రెమిస్  అని, త్రో లైన్ అని).