G-N7RFQXDVV7 18 నుంచి సినిమా థియేటర్లు ఓపెన్ అయితే…..?

Ticker

6/recent/ticker-posts

18 నుంచి సినిమా థియేటర్లు ఓపెన్ అయితే…..?

 


సినిమా థియేటర్లు ప్రారంభమవుతున్నాయని సినీ ప్రేమికులు ఒకవైపు ఉత్సాహంగా వుంటే సినీ విశ్లేషకులు మాత్రం.. కోవిడ్ 19 ఇంతగా విజ్రుంబిస్తున్న సమయంలో ధైర్యం చేసి ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? అని విశ్లేషిస్తున్నారు. ఈ నెల 18 నుంచి గ్రీన్ జోన్ లలో  సినిమా థియేటర్లను అనుమతిస్తారని వివిధ వార్తా పత్రికల్లో వార్తలు వస్తున్న నేపథ్యంలో ఒక వైపు సినీ ప్రేమికులు, నిర్మాతలు, థియేటర్ యాజమాన్యం, సినీ కార్మికులందరిలో ఒకటే సంశయం తలెత్తుతోంది.  కరోనా ఇంతగా ప్రభలుతున్న సమయంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుందా?  లాక్ డౌన్ ఇంకా పొడిగిస్తుందా? అనే సంశయం ఇంతింతై… వటుడింతై అన్నట్టు కలవరపెడుతోంది. సినిమా థియేటర్లు ఓపెన్ చేశారనుకుందాం. అందులో ఏ సినిమాలు వేస్తారు?... మార్చి మూడోవారంలో రిలీజ్ అయిన సినిమాలతన్నీ ఓటీటీ ప్లాట్ ఫారం మీద దొరుకుతున్నాయి. అవి చూసి చూసి వీక్షకులకు బోర్ కొట్టేశాయి. పోనీ కొత్త సినిమాలు విడుదల చేస్తారా?... నిర్మాతలు అంత ధైర్యం చేస్తారా? బౌతిక దూరం అంటూ నిబంధనలు వర్తిస్తున్న సమయంలో కొత్త సినిమాలు విడుదల చేస్తే… ఎంతవరకు నిర్మాత సక్సెస్ అవుతాడు. అసలే మన సినిమా సంప్రదాయం వేరు. ఎక్కువ థియేటర్లలో విడుదల చేసి కలెక్షన్లు రెండు మూడు రోజుల్లోనే రాబట్టాలి అనే సంప్రదాయమున్న ప్రస్తుత పరిస్థితుల్లో బౌతిక దూరం అంటూ నిబంధనల మధ్య సినిమా విడుదల చేస్తే నిర్మాతలకు వర్కవుట్ అవుతుందా? అలాంటప్పుడు ఎలాంటి సినిమాలు విడుదల చేస్తే… ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు? అనే విశ్లేషణ ప్రస్తుతం ఎగ్జిబిటర్లను కలవర పెడుతోంది. మరికొందరు విశ్లేషకులు మాత్రం. ఇప్పుడు కొత్త సినిమాలను విడుదల చేస్తే… నలభై రోజుల్లోనే ఓటిటిలో విడుదల చేసుకోవచ్చుగా… ఇక్కడా అక్కడా బ్యాలన్స్ అవుతుంది అంటూ చెప్పుకొస్తున్నారు.  ఓటిటి నుంచి అంత పెద్ద మొత్తం వస్తే… రామ్ రెడ్, వి, ఉప్పెన లాంటి సినిమాలు అప్పుడే డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేసేవాళ్లు… ఎందుకు ఊరుకుంటారు అని కొంతమంది విశ్లేషిస్తున్నారు.


 కోవిడ్ - 19 లాక్ డౌన్ కారణంగా  దక్షిణాది చలన చిత్ర పరిశ్రమలో దాదాపు 2000 కోట్ల పెట్టుబడులు లాక్ అయ్యాయి. గత రెండు నెలల నుంచి ఖాళీగా ఇంట్లో కూర్చోవడం వల్ల ప్రొడక్షన్ పనులు ఎక్కడి, కక్కడ ఆగిపోయాయి.. కోలీవుడ్ సినీ ప్రముఖులు కాస్త ముందడుగు వేసి కనీసం తాము పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకోవడానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరగా నిర్మాణానంతర కార్య్రకమాలు జరుపుకోవడానికి తమిళ చిత్ర పరిశ్రమకు ఆ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మే 11 నుంచి  చెన్నైలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఓ నిర్మాత మాట్లాడుతూ జూన్ లో సినిమా హాళ్లు తెరుచుకోనున్నాయి. అప్పటికి మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తిచేసి విడుదలకు సిద్ధంగా వుంచుతాం అని తెలియజేశారు.


ఇటీవల చాలా పత్రికలలో గ్రీన్ జోన్ లో  మే నెల 18 నుంచే సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్  కొన్ని నిబంధనలతో తెరుచుకుంటాయని వార్తలు వస్తున్నాయి. ఒక వేళ తెరుచుకుంటే ఎలాంటి నిబంధనలు వుంటాయి అనే విషయంపై పలువురు ప్రముఖులు చెప్పిన సమాధానాలను పరిశీలిస్తే...


ఈ విషయంపై ప్రముఖ నిర్మాత మాట్లాడుతూ  సీటుకు, సీటుకు మధ్య దూరం పెంచి, టికెట్ కౌంటర్ దగ్గర నుంచి బౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటారు. అలాగే ప్రతి ఒక్కరికీ మాస్క్ తప్పని సరి అనే సూచనలు చేస్తారు. పాప్ కార్న్ షేరింగ్ లు ఇక సినిమా హాళ్లలో వుండవు. అలాగే ఒకరి కొకరు చేతులు పట్టుకొని మాట్లాడుకునే అవకాశాలు తగ్గుతాయి. నా అంచనా ప్రకారం డైవిన్ థియేటర్లు పెరిగే ఛాన్స్ వుంది. చెన్నైలో ప్రార్థనా థియేటర్ లాగా డ్రైవిన్ థియేటర్లు హైదరాబాద్ లో కూడా వచ్చే ఛాన్స్  వుంది. హైదరాబాద్ లోని సంజీవయ్య పార్క్ ను డ్రైవిన్ థియేటర్ గా మారిస్తే….పర్యాటక రంగం పెరుగుతుంది. అలాగే ప్రభుత్వానికి అదనపు ఆదాయం చేకూరుతుంది అంటూ తన అమూల్యమైన సలహాను అందించారు. ఈ దిశగా ఆలోచిస్తే… ఇది ప్రభుత్వానికి చక్కటి సలహా అని చెప్పక తప్పదు.


ఏది ఏమైనా బౌతిక దూరం పెంచి థియేటర్లు ఓపెన్ చేసి, తగిన నిబంధనలను పాటిస్తూ, మాల్స్ లో కూడా  మినిమమ్ 2000 రూపాయలు షాపింగ్ చేస్తేనే మాల్స్ లోకి ప్రవేశం అని నిబంధనలు ప్రకటిస్తే కరోనాను కొంత వరకు అరికట్టవచ్చు అని మరికొందరి విశ్లేషకుల భావన